కేథరిన్‌కు అరుదైన వ్యాధి.. పెళ్లికి దూరం!

Mon 21st Oct 2019 07:34 AM
catherine tresa,anosmia disease,marriage,bunny heroine  కేథరిన్‌కు అరుదైన వ్యాధి.. పెళ్లికి దూరం!
Catherine Tresa Suffering From Anosmia disease కేథరిన్‌కు అరుదైన వ్యాధి.. పెళ్లికి దూరం!
Sponsored links
>Catherine Tresa Suffering From Anosmia disease" />

‘ఇద్దరమ్మాయిలతో’, ‘పైసా’,‘సరైనోడు’,‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి సినిమాలతో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ క్యాథరిన్‌ ట్రెసాకు ఈ మధ్య అవకాశాలు అస్సలు రావట్లేదు. దీంతో కొంతకాలంగా తమిళ చిత్రసీమకే ఈ యంగ్ ఎమ్మెల్యే పరిమితమైపోయింది. అయితే ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లు యంగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో మళ్లీ టాలీవుడ్ సినీ ప్రియుల ముందుకొస్తోంది.

ఇక అసలు విషయానికొస్తే.. కేథరిన్ గురించి ఓ షాకింగ్ విషయం వెలుగుచూసింది.. ఈ విషయాన్ని స్వయానా ఆమె ఓ ఇంటర్వ్యూ వేదికగా పంచుకుంది. ఇది తెలుసుకున్న కేథరిన్ వీరాభిమానులు, సన్నిహితులు అవునా.. పాపం అంటున్నారు. ‘అనోస్మియా’ అనే అరుదైన వ్యాధితో ఈ ముద్దుగుమ్మ బాధపడుతోందట. అనోస్మియా అంటే ఈ వ్యాధి ఉన్న వారు ఎలాంటి వాసనలు పసిగట్టలేరు. ఈ వ్యాధి ఉన్న వారు మంచి వాసనలే కాదు.. చెడు వాసనలు కూడా గుర్తించలేరని ఒకింత భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే వాసనలు పసిగట్టే విషయంలో ఈ వ్యాధి బాధితులు జీరో అని తెలిపింది.

అయితే ఈ లోపం కారణం తాను పెళ్లికి చేసుకోకుండా ఈ తంతుగా దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు షాకింగ్ విషయాన్ని తెలియజేసింది. అంతటితో ఆగని ఆమె.. సినిమాల్లో మాత్రం నటిస్తానని.. నటించడానికి ఈ లోపం అడ్డుకాదని అనుకుంటున్నానని యంగ్ ఎమ్మెల్యే తెలిపింది. అయితే.. సినీ ఇండస్ట్రీలో నటీనటుమణులకు ఇలాంటి అరుదైన వ్యాధుల భారీన పడటం మామూలే. అంత మాత్రాన కుంగిపోనక్కర్లేదు.. మనోధైర్యంతో ముందుకెళ్లాలంతేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Sponsored links

Catherine Tresa Suffering From Anosmia disease:

href="https://www.sakshi.com/news/movies/catherine-tresa-suffering-anosmia-disease-1233779"> >Catherine Tresa Suffering From Anosmia disease

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019