రేప‌ట్నుంచి పూరిలో ‘ఉప్పెన’ కొత్త షెడ్యూల్

Sun 20th Oct 2019 10:13 PM
uppena movie,uppena shoot,puri,vaishnav tej  రేప‌ట్నుంచి పూరిలో ‘ఉప్పెన’ కొత్త షెడ్యూల్
Uppena Movie New Schedule In Poori రేప‌ట్నుంచి పూరిలో ‘ఉప్పెన’ కొత్త షెడ్యూల్
Sponsored links
>Uppena shoot moves to Puri " />

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఉప్పెన’. వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. సుకుమార్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ ప‌తాకాల‌పై సినిమా రూపొందుతుంది.

సోమ‌వారం (అక్టోబ‌ర్ 21) నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను పూరితో పాటు కోల్‌క‌తా, గ్యాంగ్‌ట‌క్ ప్రాంతాల్లో చిత్రీక‌రించ‌నున్నారు. 20రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. త్వర‌లోనే సినిమాకు సంబంధించిన ప్రమోష‌న్స్ స్టార్ట్ కానున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

పంజా వైష్ణవ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, క్రితి శెట్టి, బ్రహ్మాజీ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం:  బుచ్చిబాబు సానా

సి.ఇ.ఒ:  చెర్రీ

బ్యాన‌ర్స్‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్

సినిమాటోగ్రఫీ:శాంద‌త్ సైనుద్దీన్‌

సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌

ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి

ఆర్ట్‌:  మోనిక రామ‌కృష్ణ‌

Sponsored links

Uppena Movie New Schedule In Poori:

href="https://www.telugucinema.com/news/uppena-shoot-moves-puri"> >Uppena shoot moves to Puri 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019