‘వెంకీమామ’కు యవ్వారం మొదలెట్టారు

Sun 20th Oct 2019 12:47 PM
venky mama,naga chaitanya,venkatesh,business  ‘వెంకీమామ’కు యవ్వారం మొదలెట్టారు
Venky Mama Business Started ‘వెంకీమామ’కు యవ్వారం మొదలెట్టారు
Sponsored links

వెంకటేష్ - నాగ చైతన్య కాంబినేషన్‌లో బాబీ డైరెక్షన్ లో వెంకీమామ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక సినిమాకి దాదాపుగా 48 కోట్ల వరకు ఖర్చు అయినట్లు భోగట్టా. అంటే ఈచిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా 48 కోట్లు పైనే రావాలి. వెంకీ, చైతు కాంబినేషన్ కాబట్టి ఖర్చు వెనక్కి వచ్చేస్తుందని బయ్యర్స్ భావిస్తున్నారు కానీ ఇంతవరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. తాజా సమాచారం ప్రకారం ఈమూవీను ఆంధ్ర ఏరియాకు 18 కోట్ల రేంజ్‌లో రేటు చెబుతున్నారు.

అంతే కాదు తెలుగు శాటిలైట్ ఎనిమిది కోట్లు, హిందీ ఎనిమిది కోట్లకు మాటలు అయ్యాయి అని తెలుస్తుంది. అమెజాన్ తో బేరాలు జరుగుతున్నాయి. ఆరు నుంచి ఏడు కోట్లు వచ్చే అవకాశం వుంది. అంటే ఓవరాల్ గా ఈమూవీ రిలీజ్ కి ముందే పాతిక కోట్లకు లోపే వచ్చే అవకాశం వుంది. పీపుల్స్ మీడియా వారు నిర్మాతలు అయినా మార్కెటింగ్ అంతా సురేష్ బాబు చేతిలో వుంది. రేటు కానీ, బయ్యర్లను కానీ ఆయనే ఫైనల్ చేయాలి. ఇక ఈచిత్రం డిసెంబర్ 13న విడుదల చేయాలనీ చూస్తున్నారు.

Sponsored links

Venky Mama Business Started:

Venky Mama Movie Latest Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019