‘మళ్ళీ మళ్ళీ చూశా’ లవర్స్‌కు కిక్కిచ్చే సినిమా!

Fri 18th Oct 2019 02:18 PM
malli malli chusa,anurag konidena,shweta avasthi,hemanth karthik  ‘మళ్ళీ మళ్ళీ చూశా’ లవర్స్‌కు కిక్కిచ్చే సినిమా!
News About Malli Malli Chusa ‘మళ్ళీ మళ్ళీ చూశా’ లవర్స్‌కు కిక్కిచ్చే సినిమా!
Sponsored links

క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై అనురాగ్‌ కొణిదెన హీరోగా హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్టైనర్‌కి శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 18న తెలుగు రాష్ట్రాల్లో 150కి పైగా థియేటర్స్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమాను యూత్‌ను బాగా ఎంటైర్‌టైన్మెంట్ చేస్తుందని చిత్రబృందం బలంగా నమ్ముతోంది. అయితే ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.

మరీ ముఖ్యంగా ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్స్, ట్రైలర్స్‌ యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇందులో కథ మొత్తం డైరీ చుట్టూనే తిరుగుతుందట. అయితే ఆ డైరీలో ఏముంది..? డైరీ చదివిన తర్వాత హీరో ఎలా మారతాడు..? అసలు ఆ డైరీ ఎవరు రాశారు..? డైరీలో ఉన్నట్లుగానే అమ్మాయిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది..? అనేది చాలా ఇంటెన్షన్ కలిగిస్తోంది. మొత్తానికి చూస్తే సినిమా స్టోరీ.. కాస్త కొత్తగానే ఉంది. పైగా ఈ మధ్య మాంచి లవ్‌ స్టోరీ ఉండే సినిమాలు వచ్చి చాలా కాలమే అయ్యింది. ఈ సినిమాతో ప్రేమ జంటలకు ఆ లోటు పూడ్చినట్లవుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. లవర్స్ కిక్కిచ్చే సినిమా కనుక తప్పకుండా చూడాల్సిందే. మరి శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమాకు లవ్ బర్డ్స్ ఏ మాత్రం మార్కులు వేస్తాయో వేచి చూడాల్సిందే.

Sponsored links

News About Malli Malli Chusa :

News About Malli Malli Chusa 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019