టాలీవుడ్‌కి కలిసిరాలేదు.. కోలీవుడ్‌లో పక్కా..!!

Thu 17th Oct 2019 08:39 PM
deepavali,kollywood,tollywood,big movies,bigil,khaidi,vijay,karthi  టాలీవుడ్‌కి కలిసిరాలేదు.. కోలీవుడ్‌లో పక్కా..!!
Deepavali Effect on Tollywood టాలీవుడ్‌కి కలిసిరాలేదు.. కోలీవుడ్‌లో పక్కా..!!
Sponsored links

టాలీవుడ్ వాళ్లు ఎందుకో దీపావళి‌ని ఎంకరేజ్ చేయరు. దీపావళికి పెద్దగా సినిమాలు ఏమి రిలీజ్ చేయరు. దీపావళికి రిలీజ్ చేస్తే సినిమా రిజల్ట్ వేరేలా వస్తుందని గట్టి నమ్మకం టాలీవుడ్ మేకర్స్‌కి. వారు భావించినట్లే దీపావళి వారికి అంతగా కలిసి రాలేదు కూడా. కానీ దీపావళి రోజు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు కోలీవుడ్ వాళ్లు.

ప్రతి దీపావళికి ఖచ్చితంగా పెద్ద సినిమాలు ఉండేటట్టు చూసుకుంటున్నారు తమిళ మేకర్స్. అలానే ఈసారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కోలీవుడ్‌లో. ఆ రెండు సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఒకటి కార్తీ కొత్త సినిమా ‘ఖైదీ’ ఈ దీపావ‌ళికి విడుదల కానుంది. గత కొన్ని సినిమాలు నుండి వరస ఫ్లాపుల‌తో కార్తి కెరియ‌ర్ బాగా డ‌ల్ అయిపోయింది. ఈ సినిమాతో ఎట్టిపరిస్థితుల్లో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు కార్తీ. ఈమూవీ‌తో హిట్ కొట్టి తన మార్కెట్‌ను స్ట్రాంగ్‌గా నిలపెట్టాలని చూస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఇక రెండు సినిమా స్టార్ హీరో విజయ్ నటించిన ‘బిగిల్’. ఈసినిమా తెలుగులో ‘విజిల్‌’ అనే పేరుతో రిలీజ్ అవుతుంది. యంగ్ డైరెక్టర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈమూవీపై త‌మిళ‌నాట భారీ అంచ‌నాలున్నాయి. మరి ఒకే రోజు వస్తున్న ఈ రెండు సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో వెయిట్ అండ్ సీ.

Sponsored links

Deepavali Effect on Tollywood:

Two Big Movies Releases on Deepavali

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019