Advertisementt

హేమమాలిని బుగ్గలపై మంత్రి కామెంట్స్!

Wed 16th Oct 2019 04:10 PM
hema malini,hema malini cheeks,minister pc sharma,roads  హేమమాలిని బుగ్గలపై మంత్రి కామెంట్స్!
Minister Comments On Hema Malini’s cheeks! హేమమాలిని బుగ్గలపై మంత్రి కామెంట్స్!
Advertisement
Ads by CJ

హేమమాలిని... నిండైన రూపం. ఆకట్టుకునే చక్కని అందం. కాలంతో పాటు తరగని అంద చెందాలు ఆమె సొంతం. 1948 అక్టోబర్ 16న చెన్నైలో పుట్టిన హేమమాలిని ఒక్క తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని.. డ్రీమ్ గాళ్‌గా మారింది. నేడు ఆమె పుట్టిన రోజు.. ఇవాళ్టితో ఈ అందాల భామ 71వ పడిలో ప్రవేశించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.. అంతేకాదు.. సెలబ్రిటీస్ కూడా చాలా వరకు ఈమె అంటే అభిమానిస్తుంటారు.. ఇష్టపడుతుంటారు కూడా. 

తాజాగా.. మధ్యప్రదేశ్ మంత్రి పీసీ శర్మ.. డ్రీమ్‌గాళ్ బుగ్గలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోడ్లను బాగు చేస్తానని చెప్పబోయి.. హేమమాలిని బుగ్గల్లా తయారు చేస్తానని మంత్రి చెప్పుకొచ్చారు. బుధవారం నాడు.. భోపాల్‌లోని హబీబ్ గంజ్ ప్రాంతంలో రోడ్లను తనిఖీ చేసిన ఆయన.. పై విధంగా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ రోడ్లు ఇది వరకు చాలా బాగుండేయని.. వాషింగ్టన్ మాదిరిగానే నిర్మించారన్నారు. అయితే ఇప్పుడు రోడ్లు గుంతలు పడి మశూచి మరకలుగా మారాయని వ్యాఖ్యానించారు. అందుకే ఈ రోడ్లన్నీ మరమ్మత్తులు చేసి హేమమాలిని బుగ్గల్లా తయారు చేస్తాని చెప్పుకొచ్చారు. శర్మ చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్‌ రాజకీయాలతో పాటు.. బీ టౌన్‌లో చర్చనీయాంశమయ్యాయి. మరి మంత్రి వ్యాఖ్యలపై డ్రీమ్‌గాళ్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Minister Comments On Hema Malini’s cheeks!:

Minister Comments On Hema Malini’s cheeks!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ