ప్రభాస్ అభిమానులకు ఈసారి నిరాశ తప్పదు!

Wed 16th Oct 2019 01:17 PM
prabhas,disappoints,fans,birthday  ప్రభాస్ అభిమానులకు ఈసారి నిరాశ తప్పదు!
Bad News to Prabhas Fans ప్రభాస్ అభిమానులకు ఈసారి నిరాశ తప్పదు!
Sponsored links

బాహుబలితో బంపర్ హిట్ కొట్టిన ప్రభాస్ సాహోతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అందుకున్నాడు. పాన్ ఇండియా మూవీస్ మీద మోజుపై బోర్లాపడిన ప్రభాస్ ప్రస్తుతం బాడీని షేప్ చేసుకునే పనిలో వర్కౌట్స్ చేస్తూ జాన్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ సినిమాలో పూజ హెగ్డేతో రొమాన్స్ చేస్తున్న ప్రభాస్ పుట్టిన రోజుకి మరో వారం రోజులే టైం ఉంది. అయితే ప్రభాస్ పుట్టిన రోజునాడు ప్రభాస్ పెళ్లి మేటర్ గాని, ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ గాని ఫస్ట్ లుక్ గాని బయటికొస్తాయంటూ ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మొదలెట్టారు.

జాన్ వర్కింగ్ టైటిల్ గా తెరకెక్కుతున్న ప్రభాస్ సినిమాకి జాన్ టైటిల్ కాదని కొత్త టైటిల్ పెడుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదని, అలాగే కొత్త సినిమా డిజైన్ కూడా వదలడం డౌట్ అంటున్నారు. అందుకే ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23న కొత్త సినిమా టీజ‌ర్లు, పోస్ట‌ర్లను మూవీ టీమ్ విడుద‌ల చేయ‌లేక‌పోతోందని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభాస్ పెళ్లి మేటర్ పై ఓ ప్రకటన రావడం కష్టమంటున్నారు. పాపం మరి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంపై అప్సెట్ అవడం ఖాయం.

Sponsored links

Bad News to Prabhas Fans:

Prabhas disappoints his fans on his Birthday

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019