ఇక అమెరికాలో ‘ప్రతిరోజూ పండగే’

Tue 15th Oct 2019 04:42 PM
pratiroju pandaage,movie,next schedule,usa  ఇక అమెరికాలో ‘ప్రతిరోజూ పండగే’
PratiRoju Pandaage Movie Shooting Update ఇక అమెరికాలో ‘ప్రతిరోజూ పండగే’
Sponsored links

అమెరికా వెళ్లనున్న ప్రతిరోజూ పండగే చిత్ర బృందం

ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం ‘ప్రతిరోజు పండగే’ ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్  సిటీలో జరుగుతోంది. ఆ తరువాత షెడ్యూల్ ని అమెరికాలో షూట్ చేయబోతున్నారు. అలానే అక్టోబర్ 15న సాయి తేజ్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఇక  ఇటీవలే రిలీజ్ చేసిన ఈ  సినిమా  ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. హీరో సాయి తేజ్, సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో మనసుల్ని చూరగొన్నారు. ఇక దర్శకుడు మారుతి... హీరో సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా చిత్రీకరించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్ టైన్ మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుంది.  

GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు.  ప్ర‌ముఖ నిర్మాత శ్రీ అల్లు అర‌వింద్ గారి సమర్పణలో,  నిర్మాత‌ బ‌న్నీవాస్ సార‌ధ్యంలో ఈ చిత్రం నిర్మాణం జరుగుతోంది.  సాయితేజ్, మారుతి కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న ప్ర‌తిరోజూ పండుగే చిత్రంపై భారీగా అంచనాలు ఏర్ప‌డ్డాయి. సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా సుప్రీమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నారు. క‌ట్ట‌ప్ప‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత చేరువైన ప్ర‌ముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్ ని ఈ సినిమా ద‌ర్శ‌కులు మారుతి ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండ‌నుంది.

నటీనటులు

సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

సాంకేతిక వర్గం

రచన, దర్శకత్వం - మారుతి దాసరి

సమర్పణ - అల్లు అరవింద్

ప్రొడ్యూసర్ - బన్నీ వాస్

కో ప్రొడ్యూసర్ - ఎస్.కె.ఎన్

మ్యూజిక్ డైరెక్టర్ - తమన్ .ఎస్

ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)

ఆర్ట్ డైరెక్టర్ - రవీందర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - బాబు

డిఓపి - జయ కుమార్

పీఆర్ఓ - ఏలూరు శ్రీను

పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను

Sponsored links

PratiRoju Pandaage Movie Shooting Update:

PratiRoju Pandaage Movie Next schedule In USA

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019