‘వెంకీమామ’తో టాప్ హీరోలకు టెన్షన్..!

Mon 14th Oct 2019 03:37 PM
venky mama,fear,allu arjun,mahesh babu,movies,sankranthi 2020  ‘వెంకీమామ’తో టాప్ హీరోలకు టెన్షన్..!
Venky Mama Fear to Allu Arjun and Mahesh Babu ‘వెంకీమామ’తో టాప్ హీరోలకు టెన్షన్..!
Sponsored links

వచ్చే సంక్రాంతికి గట్టి పోటీ ఉండేటట్టు ఉంది. సంక్రాంతికి ఏమేమి సినిమాలు వస్తున్నాయో నిన్నటితో అర్ధం అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించాయి. ఈ రెండు సినిమాలు పోటాపోటీగా జనవరి 12న రిలీజ్ అవుతున్నాయి.

ఇక ఈ రేస్‌లో కళ్యాణ్ రామ్ ‘ఎంత‌మంచివాడ‌వురా’ కూడా ఉండనుందని టీజర్‌లో హింట్ ఇచ్చారు. అలానే తమిళ చిత్రం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మూవీ ‘ద‌ర్బార్’ కూడా సంక్రాంతినే టార్గెట్ చేసింది. ఈ సినిమాలకి పోటీగా వెంకటేష్ అండ్ నాగచైతన్య కూడా రానున్నారు. వెంకీమామ చిత్రం కూడా సంక్రాంతికి కన్ఫర్మ్ అయినట్టు అర్ధం అవుతుంది.

ఈ ఏడాది స్టార్టింగ్‌లో ‘ఎఫ్ 2’ చిత్రంతో హిట్ అందుకున్న వెంకీ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని వెంకీమామని రిలీజ్ చేస్తున్నాడు. అసలే ఈమూవీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు. ఆయనకు థియేటర్స్ కొరత కూడా లేదు. సో అందుకని సంక్రాంతికి ఎంత పోటీ ఉన్నా వెంకటేష్ అండ్ చైతు వస్తున్నారు. కాకపోతే ఈ రేస్‌లో కళ్యాణ్ రామ్‌కి, రజినీకాంత్‌కి థియేటర్స్ దొరకడమే కష్టం అవుతుంది.

Sponsored links

Venky Mama Fear to Allu Arjun and Mahesh Babu:

Venky Mama in Sankranthi 2020 Race

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019