‘అల వైకుంఠపురంలో’ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

Mon 14th Oct 2019 01:21 PM
ala vaikunthapurramloo movie,allu arjun,release date,sankranthi,jan 12th,trivikram srinivas  ‘అల వైకుంఠపురంలో’ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది
Ala Vaikunthapurramloo Movie Release Date Fixed ‘అల వైకుంఠపురంలో’ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది
Sponsored links

సంక్రాంతి కానుకగా ‘అల వైకుంఠపురంలో’ జనవరి 12 -2020 న విడుదల 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో...’.  వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. 

‘అల వైకుంఠపురంలో’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల అయిన మొదటిపాట ‘సామజవరగమన’, దసరా పండగ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రం, వీటికి ముందు చిత్రం పేరును వీడియో రూపంలో విడుదల చేసిన తీరు ప్రశంసలందుకుంది. చిత్రంపై అంచనాలు మరింత పెరిగేలా అవి చేశాయన్నది ప్రేక్షకాభిమానుల మాట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్.. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు పెద్ద విజయాలు సాధించటం‌తో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్‌కి మంచి క్రేజ్ వచ్చింది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రం చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై పాట చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలను, విశేషాలను వరుసగా తెలియపరుస్తామని చిత్రయూనిట్ తెలిపింది. 

సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ  తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి.ప్రసాద్, నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు).

Sponsored links

Ala Vaikunthapurramloo Movie Release Date Fixed:

Ala Vaikunthapurramloo Movie Release on 2020, Jan 12th.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019