ఆర్ ఆర్ ఆర్: ఎన్టీఆర్ కి ఇద్దరు.. ఒకరు ఫైనల్!

Sun 13th Oct 2019 04:09 PM
rajamouli,ntr,rrr,bollywood,hollywood,heroines  ఆర్ ఆర్ ఆర్: ఎన్టీఆర్ కి ఇద్దరు.. ఒకరు ఫైనల్!
One Heroine Fixed to NTR for RRR ఆర్ ఆర్ ఆర్: ఎన్టీఆర్ కి ఇద్దరు.. ఒకరు ఫైనల్!
Sponsored links

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు హీరోస్ గా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు ఎన్టీఆర్ పై చిత్రీకరణ చేసిన రాజమౌళి ఇప్పుడు ఎన్టీఆర్ కి బ్రేక్ ఇచ్చి చరణ్ పై చిత్రీకరణ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ టీం ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉంది.

గతంలో ఎన్టీఆర్ పక్కన నటించేందుకు హాలీవుడ్ నుండి ఎడ్గర్ డేసిని తీసుకున్నారు. కానీ ఆమె కొన్ని కారణాలు వల్ల సినిమా నుండి తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ ని తీసుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ కి జోడిగా ఇద్దరు హీరోయిన్స్ కావడంతో వారిలో ఒకరిని బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేశారని సమాచారం.

త్వరలోనే ఆమె ఎవరో ప్రకటిస్తారట. ఇక బ్రిటిష్ లేడీ పాత్ర కోసం మరో హాలీవుడ్ నటిని తీసుకోవాల్సివుంది. ప్రస్తుతం టీం ఓ హాలీవుడ్ అమ్మాయిని తీసుకోవాలని చూస్తున్నారు. ఇక రామ్ చరణ్ సరసన అలియా భట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2020 జులైలో ఈమూవీ రిలీజ్ కానుంది.

Sponsored links

One Heroine Fixed to NTR for RRR:

RRR: Bollywood and Hollywood Heroines for JR NTR

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019