వెంకీ ఆవిష్కరించిన ఉల్లాల ఉల్లాల మోషన్ పోస్టర్

Sun 13th Oct 2019 03:51 PM
venkatesh,ullala ullala,motion poster,launch  వెంకీ ఆవిష్కరించిన ఉల్లాల ఉల్లాల మోషన్ పోస్టర్
Ullala ullala movie motion poster released వెంకీ ఆవిష్కరించిన ఉల్లాల ఉల్లాల మోషన్ పోస్టర్
Sponsored links

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ‘ఊల్లాల.. ఊల్లాల’ మోషన్ పోస్టర్

సీనియర్ నటుడు, విలన్ పాత్రలతో ఆకట్టుకొన్న సత్యప్రకాశ్ దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రం ఊల్లాల ఊల్లాల. గతేడాది రక్షకభటుడు, ఆనందం, లవర్స్ డే లాంటి చిత్రాలను అందించిన నిర్మాత ఏ గురురాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రం నవంబర్‌లో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను శనివారం రామానాయుడు స్టూడియోలో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాత గురురాజ్, దర్శకుడు సత్యప్రకాశ్, హీరో నటరాజ్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.

ఊల్లాల ఊల్లాల సినిమా మోషన్ పోస్టర్‌ను వెంకటేష్ ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాత గురురాజ్‌ను, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సత్యప్రకాశ్‌ను అభినందించారు. తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్న సత్య ప్రకాశ్ తనయుడు నటరాజ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశీస్సులు అందజేశారు.

ఈ సందర్బంగా నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ.. మా ఆహ్వానాన్ని మన్నించి ఊల్లాల ఊల్లాల మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన విక్టరీ వెంకటేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే దర్శకుడిగా మారిన స‌త్య‌ప్ర‌కాష్ నాకెప్ప‌టి నుంచో మంచి స్నేహితుడు. న‌టునిగా అత‌నిలో ఎంత ఫైర్ ఉందో, ద‌ర్శ‌కునిగా అంత‌కు మించిన ఫైర్ ఉంది. ఈ చిత్రానికి నేనే క‌థ‌ను అందించాను. మేకింగ్ ప‌రంగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. ‘ఊల్లాల.. ఊల్లాల’ చిత్రం నిర్మాత‌గా నాకు, ద‌ర్శ‌కునిగా స‌త్య‌ప్ర‌కాష్‌కూ క‌చ్చితంగా ఓ ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది. షూటింగ్ కార్య‌క్ర‌మాలు తుదిద‌శ‌కు చేరుకున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తాం అని తెలిపారు.

దర్శకుడు సత్యప్రకాశ్ మాట్లాడుతూ.. తనను దర్శకుడిగా మార్చినందుకు నిర్మాత గురురాజ్‌కు రుణపడి ఉంటానని అన్నారు. తన కుమారుడు నటరాజ్‌ను దీవించాలని కోరారు. ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచనని హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన నూరిన్, అంకిత ఆకట్టుకొంటారని పేర్కొన్నారు.

తారాగ‌ణం

న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత‌, గురురాజ్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, ‘బాహుబ‌లి’ ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, ‘అదుర్స్’ ర‌ఘు, జ‌బ‌ర్ధ‌స్త్ న‌వీన్‌, లోబో, మ‌ధు, జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, జ‌య‌వాణి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు

స‌మ‌ర్ప‌ణ‌:  శ్రీమ‌తి ఎ.ముత్త‌మ్మ‌

ఛాయాగ్ర‌హ‌ణం:  జె.జి.కృష్ణ‌, దీప‌క్‌

సంగీతం:  జాయ్‌

ఎడిటింగ్‌:  ఉద్ధ‌వ్‌

నృత్య ద‌ర్శ‌క‌త్వం:  శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దిలీప్ కుమార్‌

యాక్ష‌న్‌:  డ్రాగ‌న్ ప్ర‌కాష్‌

ఆర్ట్:  కె.ముర‌ళీధ‌ర్‌

పాట‌లు:  కాస‌ర్ల శ్యామ్‌, గురుచ‌ర‌ణ్‌

క‌థ - స్క్రీన్‌ప్లే - మాట‌లు -నిర్మాత‌:  ఎ.గురురాజ్‌

ద‌ర్శ‌క‌త్వం:  స‌త్య‌ప్ర‌కాష్‌.  

Sponsored links

Ullala ullala movie motion poster released:

Venkatesh launches ullala ullala motion poster

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019