చిరుతో ‘లూసిఫర్’ రీమేక్ చేసేదీ ఈయనేనా!?

Sat 12th Oct 2019 11:21 PM
chiranjeevi,lucifer,remake,surender reddy  చిరుతో ‘లూసిఫర్’ రీమేక్ చేసేదీ ఈయనేనా!?
Chiranjeevi in Lucifer remake.. With These Director? చిరుతో ‘లూసిఫర్’ రీమేక్ చేసేదీ ఈయనేనా!?
Sponsored links

 

‘సైరా నర్సింహారెడ్డి’ సినిమా భారీ హిట్ కావడంతో దర్శకుడు సురేందర్ రెడ్డి పేరిప్పుడు టాలీవుడ్‌లో మార్మోగుతోంది. ‘సైరా’ తర్వాత సురేందర్ ఏం చేయబోతున్నాడు..? మళ్లీ చిరుతోనే సినిమా తీస్తాడా..? లేకుంటే కాస్త గ్యాపిచ్చి నిదానంగా కథ చూసుకుని పట్టాలెక్కిస్తాడా..? లేకుంటే రీమేక్ సినిమా కానిచ్చేస్తాడా..? అనేది ఇప్పుడు సినీ ప్రియుల్లో .. సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే.. సైరా తర్వాత కొరటాల శివతో చిరు సినిమా చేస్తుండగా.. మరోవైపు రామ్ చరణ్ కూడా RRR షూటింగ్‌కు వెళ్లిపోయాడు. అయితే ఈ క్రమంలో సురేందర్ రెడ్డి గురించి రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ఎవరైనా కుర్ర హీరోతో లవ్ ట్రాక్‌లో సినిమా తీయాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ క్రమంలో నితిన్ పేరు వెలుగులోకి వచ్చింది. అయితే నితిన్‌ వరుసగా మూడు ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉండటంతో మళ్లీ రూట్ మార్చిన ఆయన మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెట్టారట.

‘లూసిఫర్’ రీమేక్‌ చేయాలని ఇందులో చిరు-చెర్రీ లేదా చిరు-పవన్ మల్టీస్టారర్‌గా నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా చరణ్ నిర్మాణంలోనే ఉంటుందని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను సురేందర్‌కి రీమేక్ చేయొచ్చని తాజాగా ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

Sponsored links

Chiranjeevi in Lucifer remake.. With These Director?:

Chiranjeevi in Lucifer remake.. With These Director?

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019