బన్నీ ఎందుకిలా.. డైలామాలో ఫ్యాన్స్!

టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’ సినిమా షూటింగ్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ బిజీబిజీ అవుతాడని రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయని అందులో ఒకటి వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్‌ కాగా.. మరొకటి క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్‌తో. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.

అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ రెండు సినిమాలను బన్నీ పెండింగ్‌లో పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం.. వేణు శ్రీరామ్‌, సుకుమార్‌ చెప్పిన కథలు విన్న బన్నీ తనదైన శైలిలో మార్పులు, చేర్పులు చేయాలని సూచించాడట. అంతేకాదు.. ఫలానా విధంగా కథ మార్చండని సలహా కూడా ఇచ్చాడట. దీంతో ఈ ఇద్దరు దర్శకులు మార్పులు చేయాలంటే కనీసం కొన్ని నెలలు సమయం కచ్చితంగా పడుతుంది. 

ఈ క్రమంలో ఈ ఇద్దరూ కాకుండా మరో దర్శకుడితో సినిమా చేసేస్తే పోలా.. అని అల్లువారబ్బాయి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఆ లోపు ఈ రెండు కథల్లో ఏదైనా వర్కవుట్ అయితే సరే లేకుంటే కొత్త డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బన్నీ బావిస్తున్నాడట. ఇలా రోజుకో వార్త పుట్టుకొస్తుండటంతో అసలు నిజానిజాలేంటో తెలియక మెగాభిమానులు, బన్నీ వీరాభిమానులు డైలామాలో పడ్డారట. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే బన్నీ లేదా ఇద్దరు దర్శకులు కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Bunny Fans Dilemma Over Two Cinemas

Bunny Fans Dilemma Over Two Cinemas
bunny fans
allu arjun
dilemma
sukumar
venu sriram