Advertisementt

ఈ హీరోయిన్లంతా సినిమాలకు దూరం.. దూరం!?

Sat 12th Oct 2019 05:19 PM
tollywood actress,kajal,samantha,anjali  ఈ హీరోయిన్లంతా సినిమాలకు దూరం.. దూరం!?
These Actress Says Good Bye To Movies! ఈ హీరోయిన్లంతా సినిమాలకు దూరం.. దూరం!?
Advertisement
Ads by CJ

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే నానుడి సినిమావాళ్లు చాలా ఎక్కువగా పాటిస్తుంటారన్న విషయం తెలిసిందే. సినిమాల్లోకి ఎందరో నటీనటీమణులు వస్తుంటారు.. పోతుంటారు.. ఎప్పట్నుంచో ఇండస్ట్రీలో పాతుకుపోయిన వాళ్లకు కొన్ని కొన్నిసార్లు ఏళ్ల తరబడి కూడా అవకాశాలు కష్టమే. దీంతో ఇక చాన్స్‌లు కష్టమని భావించిన హీరో, హీరోయిన్స్.. బిజినెస్, డిజిటల్ రంగంలోకి దూకేస్తున్నారు. ఇలా సెటిల్ అయిన వారు చాలా మందే ఉన్నారు.

మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయానికొస్తే.. ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు డిజిటల్.. డిజిటల్. చాలా వరకు సినిమాల్లో అవకాశాల్లో రానివాళ్లంతా ఇక చేసినన్ని చిత్రాలు చాలని డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు. టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన కాజల్, సమంత, అంజలి, సినీయర్ నటి రమ్యక‌ృష్ణల అడుగులు  డిజిటల్ వైపు పడుతున్నాయి. అంటే సినిమాలకు దాదాపు దూరం.. దూరం అని చెప్పేసినట్లేనన్న మాట. రమ్యకృష్ణను పక్కనెడితే.. మిగిలిన కాజల్, సమంత, అంజలి లాంటి హీరోయిన్లంతా సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు వార్తలు వస్తుండటం అభిమానులు, సినీ ప్రియులకు మింగునపడటం లేదు. ఇప్పటికే పైన చెప్పిన హీరోయిన్లంతా వెబ్ సిరీస్‌లో నటించడానికి కాల్ షీట్స్ కూడా దాదాపు ఇచ్చేశారు.

వాస్తవానికి ఎంటర్‌టైన్మెంట్ అనే రంగం కొత్త పుంతలు తొక్కుతుండటం.. లెక్కలేననన్ని కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో పాటు ఇంటర్నెట్ సేవలు కూడా అందరికి అనుకూల ధరల్లో ఉండటం.. మరోవైపు ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో.. డిజిటల్‌కే ఎప్పటికైనా భవిష్యత్తు అని భావించిన నటీనటులు ఇటువైపుగా అడుగులేస్తున్నారు. కాగా.. ఇండియాలో ప్రస్తుతం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు చాలా ప్రాచుర్యం పొందిన విషయం విదితమే.

These Actress Says Good Bye To Movies!:

These Actress Says Good Bye To Movies!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ