Advertisementt

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ ముగ్గురిదే హవా!!

Tue 01st Oct 2019 09:18 PM
pooja hegde,raashi khanna,rashmika,busy,heroines,tollywood  ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ ముగ్గురిదే హవా!!
These Heroines Hawa Runs in tollywood ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ ముగ్గురిదే హవా!!
Advertisement
Ads by CJ

మన టాలీవుడ్ లో హీరోయిన్స్ కి పెద్ద కొరత ఏమి ఉండదు. కావాల్సినంత మంది ఉన్నారు. కాకపోతే చాలా తక్కువ మంది క్లిక్ అవుతున్నారు. వారిలో ఈమధ్య ఎక్కువగా క్లిక్ అయిన హీరోయిన్స్ రాశిఖన్నా, రష్మిక, పూజా హెగ్డే. ప్రస్తుతం వీరికి చేతి నిండా సినిమాలే. సమంత, అనుష్క సెలెక్టెడ్ సినిమాలు చేయడంతో వీరికి ఆఫర్స్ వస్తున్నాయి. అలానే తమన్నా, రెజినా ఓల్డ్ అయిపోవడంతో వీరికి ఇంకా ప్లస్ అయింది.

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాతో పాటు అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా, అలానే ప్రభాస్ తో జాన్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ తో వాల్మీకి చేసి మంచి సక్సెస్ అందుకుంది.

రష్మిక కూడా మహేష్ సరిలేరు నీకెవ్వరూ, నితిన్ భీష్మ, అల్లు అర్జున్ - సుకుమార్ సినిమాలో నటిస్తూ బాగా బిజీగా వుంది.

ఇక అలానే రాశి ఖన్నా కూడా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో వెంకీమామతో పాటు సాయిధరమ్ తేజ్ సరసన ప్రతిరోజూ పండగే, విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూడు సినిమాలే కాదు తమిళంలో కూడా 2 సినిమాలు కమిట్ అయ్యి ఖాళీ లేకుండా గడిపేస్తుంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా వీరిద్దరికి సినిమా అవకాశాలు రావడం విశేషం.

These Heroines Hawa Runs in tollywood:

Pooja Hegde, Raashi Khanna, Rashmika Busy Heroines in Tollywood

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ