మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. రామ్‌చరణ్ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్- 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. తాజాగా.. బాలీవుడ్ నటుడు, సైరా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఫర్హాన్ అఖ్తార్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవిను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిరు గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అమితాబ్ చెప్పుకొచ్చారు.
ఆ విషయం ఏమిటంటే.. అమితాబ్ బచ్చన్ ఇచ్చిన అమూల్యమైన సలహాను చిరు పెడ చెవిన పెట్టాడట. ‘నేను చిరంజీవి గారికి ఎన్నో సలహాలు ఇచ్చాను. కానీ ఆయన మాత్రం అస్సలు పాటించలేదు. పాలిటిక్స్‌లోకి వెళ్లొద్దని సలహా ఇచ్చాను కానీ ఆయన పాటించలేదు. అప్పట్లో నేను కూడా రాజకీయాల్లోవెళ్లి ఎన్నో ఇబ్బందులను ఎదర్కొన్నాను. నా లాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు’ అని చిరుకు సలహా ఇచ్చానని బిగ్‌బీ చెప్పుకొచ్చారు. బహుశా చిరు రాజకీయాల్లోకి రాకుండా సినిమాల్లో ఉండుంటే మాత్రం సినీ ఇండస్ట్రీలో ఆయన్ను కొట్టే దమ్మున్నోడు ఉండరమో.