Advertisementt

ఆస‌క్తి రేపుతున్న ‘ఆవిరి’ టీజ‌ర్

Sun 29th Sep 2019 01:27 PM
aaviri,teaser 1,interesting,released  ఆస‌క్తి రేపుతున్న ‘ఆవిరి’ టీజ‌ర్
Aaviri Teaser 1 Released ఆస‌క్తి రేపుతున్న ‘ఆవిరి’ టీజ‌ర్
Advertisement
Ads by CJ

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆవిరి’. ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా నటిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 

ఓ ఫ్యామిలీ ఉండే ఇంట్లో ఆత్మ ఉంటే ఎలాంటి ప‌రిస్థితులు చోటు చేసుకుంటాయ‌నే కాన్సెప్ట్ మీద ద‌ర్శ‌క నిర్మాత ర‌విబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైల‌ర్‌లో స‌న్నివేశాలు, విజువ‌ల్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతున్నాయి. హర్రర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో ర‌విబాబు త‌న‌దైన మార్కును క్రియేట్ చేశారు. ఇప్పుడు మ‌రోసారి హర్రర్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌నున్నారు. 

న‌టీన‌టులు:

ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ఆర్ట్‌:  నారాయ‌ణ రెడ్డి

ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌

యాక్ష‌న్‌: స‌తీశ్‌

కెమెరా: ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి

మ్యూజిక్:  వైధి

స్క్రీన్‌ప్లే: స‌త్యానంద్‌

ర‌చ‌న‌, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: ర‌విబాబు

Aaviri Teaser 1 Released:

Aaviri Teaser 1.. interesting

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ