ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Iam Ready to Romance Star Hero Said Rashmika

ఆ స్టార్ హీరోతో రొమాన్స్‌కు నేను రెడీ: రష్మిక!

రష్మిక మందన్నా.. ఈ క్యూట్ బ్యూటీ టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ పేరు మాత్రం మార్మోగిపోతోంది. ‘ఛలో’, ‘గీత గోవిందం’ లాంటి సినిమాలు చాలు ఈ భామ ఎక్కడికెళ్లినా చెప్పుకోవడానికి.. ఈ రెండు సినిమాలు రష్మిక రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తోంది. ఇది కూడా రష్మిక సినీ కెరీర్‌లో ఓ మైలు రాయిగా నిలిచిపోనుంది.!

అయితే ఇప్పటివరకూ టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో నటించేసి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ భామకు మరో కోరిక ఉందట. టాలీవుడ్‌ను ఏలేసిన ఈ భామ కోలీవుడ్‌ను ఏలానుకుంటుందోట. అందుకే.. తమిళంలో సినిమా అంటే చాలు రెడీగా ఉన్నానని చెబుతోంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ 64 చిత్రంలో రష్మిక నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ ఇంటర్వ్యూ వేదికగా రష్మిక తన మనసులోని మాటను బయటపెట్టింది. ‘తమిళ్ స్టార్ హీరో అజిత్‌ సరసన నేను హీరోయిన్‌గా నటించాలని ఉంది. అజిత్‌తో కలిసి స్క్రీన్ రొమాన్స్ చేయడానికి నేను ఎప్పటికీ ఇష్టపడతాను’ అని చెప్పుకొచ్చింది. మరి ఈ భామ కోరిక నెరవేరుతుందో.. కలగానే మిగిలిపోతుందో వేచిచూడాలి మరి.

Iam Ready to Romance Star Hero Said Rashmika

Iam Ready to Romance Star Hero Said Rashmika
romance
star hero
rashmika mandanna
tamil star hero
ajith