Advertisementt

‘సైరా’కు సమస్యలు మొదలైనాయ్

Sat 28th Sep 2019 07:14 AM
chiranjeevi,sye raa movie,hindi,pramotions,problems,release  ‘సైరా’కు సమస్యలు మొదలైనాయ్
Problems Starts to Sye Raa Narasimha Reddy Movie ‘సైరా’కు సమస్యలు మొదలైనాయ్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ సైరా అక్టోబర్ 2 న రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది కాని రోజులు దగ్గర పడేకొద్దీ మేకర్స్ తో పాటు అభిమాలను టెన్షన్ కు గురిచేస్తోంది ఈమూవీ. ముఖ్యంగా ఈసినిమా మేకర్స్ పై ఉయ్యాలవాడ వారసులు కోర్టుకు వెళ్లడం.. పరిహారం ఇవ్వడం లేదని.. సినిమా విడుదల నిలిపి వేయాలని కోర్టును ఆశ్రయించడంతో డ్రామా మొదలైంది. అసలు రిలీజ్ అవుతుందో లేదో అన్న అనుమానాలతో నిన్న ఈమూవీ సెన్సార్ ఫార్మర్లిటీస్ పూర్తి చేసుకుంది.

నిన్న సాయంత్రం ఈమూవీ యూ/ఏ సర్టిఫికెట్ తో బయటకు వచ్చింది. తెలుగు వెర్షన్ కి అయితే సర్టిఫికెట్ వచ్చింది కానీ హిందీ వెర్షన్ సర్టిఫికెట్ రాలేదు. అయితే హిందీ వెర్షన్ కి కూడా ఈ రోజు (శుక్రవారం) పూర్తిచేయనున్నారు. తమిళ వెర్షన్ సెన్సార్ కూడా పూర్తి అయింది. ఈ స్థాయి గందరగోళాల మధ్యే ‘సైరా’ ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రమోషన్ ఆలస్యమైంది.

మరో సమస్య ఏంటంటే ఈమూవీ ఫైనల్ సౌండ్ పై క్లారిటీ రావడానికి ఇంకా సమయం పడుతుంది.  అది పూర్తి అయితేనే కానీ క్యూబ్ ప్రింట్ ని ఫైనల్ చేసే అవకాశం లేదు. ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నారు మేకర్స్. ఎంత ప్లాన్ చేసుకున్న ఏదొక విషయంలో బ్రేక్ లు పడుతూనే ఉంది. అందుకే ఇతర భాషల్లో ప్రమోషన్స్ కి లేట్ అవుతుంది. హిందీలో రిలీజ్ చేసి పాన్ ఇండియా చిత్రం అనిపించుకుంద్దాం అంటే అదే రోజు ‘వార్’ అనే సినిమా రిలీజ్ అవుతుంది. మరి దాని రిజల్ట్ పాజిటివ్ గా ఉంటే సైరా చేతులు ఎత్తేసినట్టే. ఇటువంటి ఇబ్బందులు మధ్య ఈమూవీ 2 న రిలీజ్ అవుతుంది.

Problems Starts to Sye Raa Narasimha Reddy Movie:

So Many Problems to Chiranjeevi Sye Raa Movie

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ