ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Keerthy Suresh rejects Rana Daggubati’s film?

రానాకు షాకిచ్చిన మహానటి.. నిజమేనా!!

దగ్గుబాటి రానా హీరోగా.. డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి నందినీ రెడ్డి సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రైమ్ నేపథ్యంలో ఉన్న సినిమాలే చాలా వరకు సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో అందరూ అదే బాటలోనే తాను నడవాలని భావించిన నందిని.. ఒక కొరియన్ సినిమా రీమేక్‌కు ఫిక్సయ్యారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని హక్కులను రానా సొంతం చేసుకొన్నారు.

అయితే రానా సరసన నటించేదెవరు..? టాలీవుడ్‌లో నటించిన భామలే సరిపోతారా..? లేకుంటే బాలీవుడ్ పట్టుకురావాలా..? అనే యోచనలో పడ్డారట నందిని. ఈ క్రమంలో ‘మహానటి’ మూవీతో స్టార్ హీరోయిన్‌గా‌ మారిన కీర్తి సురేష్‌ను సంప్రదించారట. ఆమె నో చెప్పేసిందట. దీంతో రానాకు మహానటి షాకిచ్చినట్లైంది. ఇందుకు కారణం ఆమెకు కథ నచ్చకపోవడమా? లేదా డేట్స్ సర్దుబాటు అయ్యుండకపోవడమా? అన్నది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. 

ఈ క్రమంలో నందిని రెడ్డి మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తుండగా సడన్‌గా కాజల్ అయితే ఎలా ఉంటుందని ఆలోచన తట్టిందట. అయితే.. గతంలో కాజల్  చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మంచి ఫలితాన్నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానాతో కాజల్ కెమిస్ట్రీ అదిరిందనే టాక్ కూడా అప్పట్లో గట్టిగానే వచ్చింది. అందుకే కాజల్‌నే మళ్లీ ఈ సినిమాలో అనుకుంటున్నారట. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో..? వేచి చూడాలి మరి. అయితే ఇందులో నిజానిజాలెంతున్నాయో తెలియాలంటే దర్శకనిర్మాతలు రియాక్ట్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే మరి.

Keerthy Suresh rejects Rana Daggubati’s film?

Keerthy Suresh rejects Rana Daggubati's film?
keerthy suresh
rana daggubati
mahanati
nandini reddy