Advertisement

బిగ్ బాస్ ఫేక్ ఎలిమినేషన్ ఎవరంటే..?

Mon 23rd Sep 2019 01:46 PM
bigg boss,elimination,himaja,details  బిగ్ బాస్ ఫేక్ ఎలిమినేషన్ ఎవరంటే..?
This Week Bigg Boss Elimination Details బిగ్ బాస్ ఫేక్ ఎలిమినేషన్ ఎవరంటే..?
Advertisement

ఈవారం ముగ్గురు ఇంటి సభ్యులు నామినేషన్ లో ఉంటే అందులో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అని నిన్న నాగార్జున చెప్పడంతో ఒక్కసారిగా ఇంటిలో ఉన్న సభ్యులు అండ్ బయట ప్రేక్షకులు షాక్ తిన్నారు.  నాగ్ నిన్న రావడం రావడమే డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి చివరిలో రాహుల్ ని ఎలిమినేట్ చేసాడు. ఒక్కసారిగా హౌస్ మొత్తం నిశ్శబ్దం. రాహుల్ సడన్ గా వెళ్ళిపోయాడు. స్టేజి పైకి వచ్చి అందరితో సరదాగా మాట్లాడాడు. ఆ తరువాత నాగ్ ఇది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పి అతన్ని వేరే ఏదో రూమ్ కి పంపినట్టు నిన్న మనం చూసాం.

అయితే ఆ తరువాత ఏమి జరుగుతుందంటే... మనకి ఎక్స్ క్లూసివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్ ని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లోకి పంపుతారట. అక్కడ రాహుల్ కొన్ని రోజులు పాటు ఉండనున్నారు. సీక్రెట్  రూమ్ లో ఉండి లైవ్ అంతా చూస్తాడు. బిగ్ బాస్ ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్తాడు. అది మ్యాటర్. ఇలానే సీజన్ 1 లో ముమైత్ ఖాన్.. బిగ్ బాస్ సీజన్ 2లో నూతన్ నాయుడు విషయంలో ఇలానే చేసారు. ఇప్పుడు రాహుల్ ని అలా చేసారు. రాహుల్ కి ఎక్కువ ఓటింగ్స్ రావడంతో ఆయన హౌస్ లో ఉండనున్నారు. మరి ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే హిమజ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఈమెకు తక్కువ ఓటింగ్స్ రావడంతో ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది. 

This Week Bigg Boss Elimination Details:

Himaja out from the Bigg Boss

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement