దేవీశ్రీని టాప్ డైరెక్టర్ ఎందుకు సైడ్ చేస్తున్నట్లు!?

Sun 22nd Sep 2019 06:54 PM
devi sri prasad,koratala shiva,chiru-koratala movie,tollywood  దేవీశ్రీని టాప్ డైరెక్టర్ ఎందుకు సైడ్ చేస్తున్నట్లు!?
Why Top Avoiding Music director Devi sri prasad దేవీశ్రీని టాప్ డైరెక్టర్ ఎందుకు సైడ్ చేస్తున్నట్లు!?
Sponsored links

రాక్‌స్టార్ దేవీ శ్రీ.. ఈ పేరు విన్నా.. చదివినా టక్కున గుర్తొచ్చేది ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈయన్ను మించిన వారు లేరు.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అని. టాప్ డైరెక్టర్స్, స్టార్ హీరోలకు సంగీతం అందించడంలో ఈయనే దిట్ట. అంతేకాదు ఈయన డేట్స్ ఖాళీగా లేవంటే చాలు.. కొద్దిరోజులు షూటింగ్ అన్నీ ఆపేసి మరి దర్శకనిర్మాతలు వేచి చూసిన రోజులు కోకొల్లలు. అలాంటి దేవీ శ్రీ ఈ మధ్య ఎందుకో ఫామ్ కోల్పోయాడని.. అందుకే అవకాశాలన్నీ చేజారుతున్నాయని తెలుస్తోంది.

‘మిర్చీ’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ లాంటి భారీ హిట్ చిత్రాల్లో పిలిచి మరీ అవకాశాలిచ్చిన టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ.. ఇప్పుడూ దేవిని పూర్తిగా పక్కనెట్టినట్లు తెలుస్తోంది. అంటే ఇప్పటి వరకూ కొరటాల చేసిన అన్నీ సినిమాలకు దాదాపు దేవీనే సంగీతం అందించాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించి నటించిన ‘సైరా’ తర్వాత చిరు-కొరటాల కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో మ్యూజిక్‌గా డైరెక్టర్‌గా రాక్‌స్టార్‌ను తీసుకోకూడదని ఫిక్స్ అయ్యారట. ఇందుకు కారణం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను కొరటాల లైన్‌లో పెట్టారని సమాచారం. వాస్తవానికి సైరా సినిమాలో కూడా ఇద్దరు బాలీవుడ్ సంగీత దర్శకులు పనిచేశారు. వాళ్ల పనితీరు బాగా నచ్చిన కొరటాల.. ఇక దేవీని పక్కనెట్టాలని భావిస్తున్నాడట. అసలే చిరంజీవి చిత్రం గనుక మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడట శివ. అయితే ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే సినిమా పట్టాలెక్కేవరకు వేచి చూడాలి మరి.

Sponsored links

Why Top Avoiding Music director Devi sri prasad:

Why Top Avoiding Music director Devi sri prasad  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019