ఇప్పుడు గ్యాంగ్ లీడర్ పరిస్థితి ఏంటి?

Sun 22nd Sep 2019 05:45 AM
nani,gang leader,collections,dropped  ఇప్పుడు గ్యాంగ్ లీడర్ పరిస్థితి ఏంటి?
What is the Gang Leader Situation? ఇప్పుడు గ్యాంగ్ లీడర్ పరిస్థితి ఏంటి?
Sponsored links

నాని క్రేజ్ తో యావరేజ్ టాక్ వచ్చిన గ్యాంగ్ లీడర్ కి ఫస్ట్ వీకెండ్ లో అదరగొట్టే కలెక్షన్స్ వచ్చాయి. మొదటి వారానికే నాని గ్యాంగ్ లీడర్ బ్రేక్ ఈవెన్ సాధించడం గ్యారెంటీ అన్నారు. నాని క్రేజ్ ఫస్ట్ వీకెండ్ వరకే పని చేసింది. గ్యాంగ్ లీడర్ అసలు రంగు సోమవారం నుండే బయటపడింది. గ్యాంగ్ లీడర్ కలెక్షన్ సోమవారం వీక్ డేస్ మొదలవడంతోనే డ్రాప్ అవడం మొదలైంది. అలా ఫస్ట్ వీక్ గడిచేసరికి నాని గ్యాంగ్ లీడర్ వరల్డ్ వైడ్ గా 8.96 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఇక ఈ శుక్రవారం నుండి గ్యాంగ్ లీడర్ సినిమాకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అసలే భారీ వర్షాలు. దానికి తోడు వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్, సూర్య బందోబస్త్ చిత్రాలు గ్యాంగ్ లీడర్ కి విలన్ గా తయారయ్యాయి. వాల్మీకి, బందోబస్త్ కి ఎంతగా యావరేజ్ టాక్ పడినా..  ఆ రెండు సినిమాల వలన నాని గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ పూర్తిగా పడిపోతాయి. నాని క్రేజ్ కూడా ఈ రెండు సినిమాలను దాటి పని చెయ్యడం కష్టం. వాల్మీకి సినిమాకి యావరేజ్ టాకొచ్చినా.. బిసి సెంటర్స్ లో ఆ సినిమా కలెక్షన్స్ బావుంటాయి. ఇక సూర్య బందోబస్త్ కి యావరేజ్ టాకే పడింది. మరి ఈ రెండు సినిమాల మధ్యన గ్యాంగ్ లీడర్ నలిగిపోవడం ఖాయం.

Sponsored links

What is the Gang Leader Situation?:

Gang Leader Collections Dropped

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019