‘బందోబస్త్’ని అలా వదిలేశారేంటి?

Fri 20th Sep 2019 09:37 PM
suriya,bandobast,valmiki,promotions,hero suriya movie  ‘బందోబస్త్’ని అలా వదిలేశారేంటి?
No Promotions to Bandobast Movie ‘బందోబస్త్’ని అలా వదిలేశారేంటి?
Sponsored links

సూర్య - మోహన్ లాల్ - ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కాప్పాన్’ తెలుగులో ‘బందోబస్త్’ అనే పేరుతో రిలీజ్ అవుతుంది. ఈచిత్రం వాల్మీకి సినిమాతో పోటీగా విడుదలైంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈసినిమాపై తెలుగులో అంతగా బజ్ లేదు. సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది కానీ ప్రమోషన్స్ వంటివి ఏమి చేయలేదు. ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చేసారు కానీ అది పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.

తమిళంలో ఈసినిమా ఆడియో ఈవెంట్ కి తలైవా రజనీకాంత్- శంకర్ వంటి హేమా హేమీలు హాజరయ్యారు. కానీ తెలుగులో ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడేవాళ్లే లేరు. ఇద్దరు స్టార్ హీరోస్ అయినా సూర్య అండ్ మోహన్ లాల్ చిత్రానికి అసలు ప్రమోషన్స్ లేకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది ఈ చిత్ర ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించే అంశమని భావిస్తోంది ట్రేడ్. ఈ సినిమాని ఇక్కడ కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌కి కూడా ఏమి పట్టలేదు అనిపిస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కానీ విషయం. ఈసినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ వారు భారీగా నిర్మించారు. కేవీ ఆనంద్ దర్శకత్వం వహించారు.

Sponsored links

No Promotions to Bandobast Movie :

Bandobast Movie Promotions weak in tollywood

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019