అల్లు రామాయణంలో ప్రభాస్.. పాత్ర ఇదేనా!?

Thu 19th Sep 2019 02:40 AM
allu aravind,ramayanam,prabhas,hrithik roshan,deepika padukune,ramayanam movie  అల్లు రామాయణంలో ప్రభాస్.. పాత్ర ఇదేనా!?
Prabhas Role in Allu Aravind Ramayanam Movie అల్లు రామాయణంలో ప్రభాస్.. పాత్ర ఇదేనా!?
Sponsored links

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నితేష్‌ తివారీ (దంగల్‌ ఫేం), రవి ఉద్యవర్‌ (మామ్‌ ఫేం) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఎవరెవర్ని తీసుకోవాలి..? అని పాత్రదారులను వెతికే పనిలో దర్శకనిర్మాతలు బిజిబిజీగా ఉన్నారు. ముఖ్యంగా రాముడు, రావడుణు పాత్రలో ఎవరెవర్ని తీసుకోవాలనే దానిపై ప్రస్తుతం నిర్మాతలు యోచిస్తున్నారు. అయితే.. తాజాగా ఇందుకు ఓ వార్త వైరల్‌గా మారింది.

అల్లువారి రామాయణంకు రాముడు, సీత, రావణుడు దొరికేశారన్నదే ఆ వార్త సారాంశం. ఈ చిత్రంలో హృతిక్ - దీపిక జోడీ శ్రీరాముడు- సీతాదేవిగా నటిస్తున్నారని ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై నితేష్‌ తివారీ స్పందిస్తూ అబ్బే.. అదేంలేదే అంటూ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు. అయితే ఇప్పటికే హృతిక్, దీపిక పదుకొణే, టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ వంటి స్టార్లకు సిగ్నల్స్ వెళ్లిపోయాయట.

వీరిలో హృతిక్ - దీపిక జోడీ.. శ్రీరాముడు- సీతాదేవిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ మాత్రం అత్యంత కీలకమైన రావణాసురుడి పాత్రలో నటిస్తే బావుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని టాక్. ప్రస్తుతం బాలీవుడ్‌ వరకే నటీనటులను తీసుకుంటున్న దర్శకనిర్మాతలు.. టాలీవుడ్‌ వైపు రాలేదు. త్వరలోనే ఈ విషయమై ప్రభాస్‌ను సంప్రదించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ భారీ సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? లేకుంటే నెగిటివ్ రోల్ కాబట్టి చేయనని సింపుల్‌గా ఒక్కమాటతో తేల్చేస్తారా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

Prabhas Role in Allu Aravind Ramayanam Movie:

Allu Aravind Ramayanam Movie: Waiting for Prabhas Acceptance

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019