‘సైరా’కి వాళ్ళ క్రేజ్ ఎంతవరకు పనికొస్తుందో!

Wed 18th Sep 2019 09:04 PM
nayanthara,vijay sethupathi,sye raa narasimha reddy,tamil promotions,chiranjeevi,ram charan  ‘సైరా’కి వాళ్ళ క్రేజ్ ఎంతవరకు పనికొస్తుందో!
They are the Key Role for Sye Raa Narasimha Reddy Tamil Promotions ‘సైరా’కి వాళ్ళ క్రేజ్ ఎంతవరకు పనికొస్తుందో!
Sponsored links

నయనతార కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్, విజయ్ సేతుపతి తమిళనాట సూపర్ హీరో. మరి ఈ ఇద్దరు నటించిన సైరా నరసింహారెడ్డికి తమిళనాట వీళ్ళ క్రేజ్ ఎంతవరకు పనికొస్తుందో అనేది ఆ సినిమా ఫలితంపై ఆధారపడి ఉంటుంది. సైరాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి ఓ కీ రోల్ ప్లే చేసాడు. ఇంకా ప్రమోషన్స్ మొదలెట్టని సైరా టీంకి నయనతార షాకిస్తూనే ఉంది. రేపు ఆదివారం జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా నయన్ వస్తుంది అంటే నమ్మకం లేదు. చరణ్ పర్సనల్ రిక్వెస్ట్ కూడా నయన్ పట్టించుకోలేదనే టాక్ ఉంది. మరి ఈ సినిమాని తమిళనాట ఏ ప్రెస్ మీట్ పెట్టో ప్రమోట్ చేస్తారు. అక్కడికి నయన్ వస్తుంది అంటే నమ్మలేం.

ఇక విజయ్ సేతుపతి మాత్రం సైరా ఈవెంట్స్ అన్నిటికి హాజరయ్యేలా కనబడుతున్నాడు. గతంలో సైరా టీజర్ రిలీజ్ కే ముంబై వెళ్ళాడు. ఇక అయన క్రేజ్ తమిళంలో పనిచేసి సైరా మీద బజ్ క్రియేట్ చేస్తుంది. నయనతార, విజయ్ సేతుపతిలు ప్రస్తుతం కోలీవుడ్ లో మంచి స్టార్ స్టేటస్ ఉన్న నటులు కావడంతో సైరా సినిమా మీద కూడా తమిళ ప్రేక్షకులకు ఆసక్తి కలిగింది. మరి నయన్, విజయ్ సేతుపతిల మ్యానియా సైరా మీద పనిచేసి అక్కడ మంచి ఓపెనింగ్స్ రాబడితే సైరా తమిళంలోనూ సేఫ్ అవుతుంది.

Sponsored links

They are the Key Role for Sye Raa Narasimha Reddy Tamil Promotions :

Nayanthara and Vijay Sethupathi for Sye Raa Narasimha Reddy Tamil Promotions

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019