‘వాల్మీకి’.. పూజా కోరిక తీర్చుతాడా? లేక?

Wed 18th Sep 2019 02:37 PM
pooja hegde,special role,valmiki movie  ‘వాల్మీకి’.. పూజా కోరిక తీర్చుతాడా? లేక?
Pooja Hegde Special Role in Valmiki Movie ‘వాల్మీకి’.. పూజా కోరిక తీర్చుతాడా? లేక?
Sponsored links

పూజాహెగ్డే ఇంతవరకు నటించిన తెలుగు సినిమాలేవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేదు. మహర్షి కానీ, అరవింద సమేత కానీ యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి కానీ.. బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే కాలేదు. కానీ అమ్మడు అదృష్టం బాగుంది.. పూజకి లక్కీగా ఛాన్స్ ల మీద ఛాన్సులొస్తున్నాయి. తాజాగా పూజాహెగ్డే నటించిన వాల్మీకి రేపు శుక్రవారం విడుదల కాబోతుంది. వాల్మీకిలో అసలు పూజ అవసరం లేకపోయినా.. దర్శకుడు హారిష్ కావాలని వరుణ్ తేజ్ కోసం వాల్మీకి ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ క్రియేట్ చేసి పూజని సెట్ చేసాడు.

మరి చాలా తక్కువ నిడివున్న పాత్రలో పూజ ఈ సినిమాలో నటించింది. ఇప్పటివరకు బయటికొచ్చిన పూజ లుక్స్ బావున్నాయి. ఇక తాజాగా విడుదలైన పూజ - వరుణ్ ల రీమిక్స్ సాంగ్ విజువల్స్ లో కూడా పూజ అదిరిపోయింది. మరి తమిళనాట సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో హిట్ కొడుతుందని నమ్మకంగా చెప్పలేం. ఎందుకంటే దర్శకుడు ఈ సినిమాని ఉన్నది ఉన్నట్టుగా తియ్యకుండా తన టాలెంట్ తో సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టాడు. వరుణ్ తేజ్ ని మరీ నెగెటివ్ గా కాకుండా... కాస్త హీరోయిజాన్ని ఎలివేట్ అయ్యే సీన్స్  జోడించాడు అందుకే పూజ వచ్చింది. మరి ఈ సినిమా తెలుగులో హిట్ అయితే పూజకి కలిసొస్తుందో.. లేదంటే పూజ క్రేజ్ వాల్మీకికి  కలిసొస్తుందో చూద్దాం.

Sponsored links

Pooja Hegde Special Role in Valmiki Movie:

Pooja Hegde Craze vs Valmiki Exceptions

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019