మహేశ్ కథ బాలీవుడ్ హీరోకు వెళ్లిపోయింది!?

Tue 17th Sep 2019 06:31 PM
ranbir kapoor,replace,mahesh babu. sandeep reddy vanga,devil  మహేశ్ కథ బాలీవుడ్ హీరోకు వెళ్లిపోయింది!?
Ranbir Kapoor replaces Mahesh Babu in director Sandeep Reddy Vanga’s Devil? మహేశ్ కథ బాలీవుడ్ హీరోకు వెళ్లిపోయింది!?
Sponsored links

అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతోనే ఈ సినిమా తెరకెక్కించాలని భావించిన ఓ డైరెక్టర్ మనసు మార్చుకుని అబ్బే.. తెలుగులో ఎందుకులే అని కాస్త మార్పులు చేర్పులు చేసి బాలీవుడ్‌ హీరో దగ్గరికి వెళ్లాడట. అయితే ఆ హీరో కూడా స్టోరీ వినగానే.. ‘నేను రెడీ సార్’ అన్నారట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో.. హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.

‘అర్జున్‌రెడ్డి’ అంటూ ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ఎవరూ ఊహించని స్థాయికి ఆయన ఎదిగిపోయారు. ఒక్క తెలుగులోనే కాదండోయ్.. ఇదే సినిమాను బాలీవుడ్‌లోనూ ‘కబీర్‌సింగ్’గా రీమేక్ చేసి బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు. ఇలా అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన సందీప్.. స్టార్ హీరోలతోనే సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాడట. 

అందుకే మహేశ్ బాబు కోసం ఓ స్టోరీ సిద్ధం చేసిన ఈయన.. చివరికి అసలు మన రేంజ్‌ టాలీవుడ్ కాదు.. ఇప్పుడు బాలీవుడ్ కదా అనుకున్నారేమో కానీ మనసు మార్చుకుని.. ‘డెవిల్‌’ అనే టైటిల్‌తో ఈ స్క్రిప్ట్‌ని రణ్‌బీర్‌కి వినిపించినట్లు బాలీవుడ్ టాక్. టైటిల్‌తో పాటు, కంటెంట్‌ కూడా ఆ హీరోగారికి తెగనచ్చిందట. త్వరలోనే తాను ఫ్రీ అవుతానని షూటింగ్ పట్టాలెక్కిద్దామని సందీప్‌కు హీరో మాటిచ్చారట. మరి మహేశ్‌‌తో సినిమా తీయాలని ఎందుకు అనుకున్నట్లు..? బాలీవుడ్‌కు ఎందుకెళ్లినట్లు..? అర్జున్‌రెడ్డి హిట్టయ్యింది సరే.. ఈ సినిమా ఎలా ఉంటుంది..? బాలీవుడ్ ప్రియులను ఒప్పిస్తుందా..? లేదా అనేది త్వరలో తెలుస్తుంది మరి.

Sponsored links

Ranbir Kapoor replaces Mahesh Babu in director Sandeep Reddy Vanga’s Devil?:

Ranbir Kapoor replaces Mahesh Babu in director Sandeep Reddy Vanga’s Devil?  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019