Advertisementt

వెన్నెల కిశోర్‌ని సేఫ్ చేసిందీ సినిమా!

Tue 17th Sep 2019 01:32 PM
vennela kishore,role,nani gang leader,good response  వెన్నెల కిశోర్‌ని సేఫ్ చేసిందీ సినిమా!
Vennela Kishore Safe with Nani Gang Leader వెన్నెల కిశోర్‌ని సేఫ్ చేసిందీ సినిమా!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా మారిన వెన్నెల కిషోర్ చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. వెన్నెల కిషోర్ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. కొంతమంది హీరోలైతే వెన్నెల కిషోర్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా మన్మథుడు 2 సినిమా ప్లాప్ అయినా వెన్నెల కిషోర్ కామెడీకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇండియా వైడ్ గా తెరకెక్కిన సాహోలో వెన్నెల కిషోర్ పాత్ర ఆటలో అరటి పండైనా.... ప్రస్తుతం వెన్నెల కిషోర్ ని మరో సినిమా కాపాడింది. అదే నాని గ్యాంగ్ లీడర్.

గ్యాంగ్ లీడర్ సినిమాలో వెన్నెల కిషోర్ కనిపించింది పావుగంట అయినా... సంతూర్ సెన‌క్కాయల పాత్రలో హిలేరియస్ కామెడీ పండించాడు. గ్యాంగ్ లీడర్ సినిమాలోని ప్లస్ పాయింట్స్ లో వెన్నెల కిషోర్ కాంబో సీన్స్ హైలెట్ గా ఉన్నాయి. సంతూర్ సెన‌క్కాయల పాత్రలో మ‌గాళ్లంటే ప‌డి చ‌చ్చే వ్య‌క్తిగా నవ్వులు పూయించాడు. ఇక నాని - వెన్నల మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ చాలా బావున్నాయంటున్నారు ప్రేక్షకులు. మరి కేవలం పావుగంటలోనే అంత కామెడీ పండించిన వెన్నెల కిషోర్ సినిమా మొత్తంలో కనబడితే... సినిమా ఫలితం మరోలా ఉండేదంటున్నారు ప్రేక్షకులు.

Vennela Kishore Safe with Nani Gang Leader:

Good Response to Vennela Kishore Role in Nani Gang Leader

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ