‘దామిని విల్లా’ షూటింగ్ అప్డేట్

Mon 16th Sep 2019 01:05 AM
daamini villa,movie,shooting,completed  ‘దామిని విల్లా’ షూటింగ్ అప్డేట్
Daamini Villa Movie Shooting Update ‘దామిని విల్లా’ షూటింగ్ అప్డేట్
Sponsored links

‘దామిని విల్లా’ షూటింగ్ పూర్తి

ఆదిత్య ఓం, రేఖా భోజ్ హీరోహీరోయిన్లుగా శ్రీ తిరుమల సినిమాస్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత దండెం పోలారావు నిర్మించిన డిఫరెంట్ హారర్ చిత్రం ‘దామిని విల్లా’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. షూటింగ్ అనంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నిర్మాత దండెం పోలారావుగారు అందించిన సహకారంతో సినిమాని ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా రూపొందించాము. ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడా రానటువంటి కొత్త పాయింట్‌తో ఈ చిత్రం ఉంటుంది. ఆదిత్య ఓం ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఎవరూ ఊహించని ట్విస్ట్‌లు ఈ సినిమాలో ఉంటాయి. ఆదిత్య ఓం నటన, రేఖా భోజ్ అందాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఈ నెల 30న ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్‌ను విడుదల చేయనున్నాము. గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పక్కాగా పూర్తి చేసి, సినిమాని మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..’’ అన్నారు.

ఆదిత్య ఓం, రేఖా భోజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి బ్యానర్: శ్రీ తిరుమల సినిమాస్, కెమెరా: శివశంకర్, సబ్బి శ్రీనివాస్, సంగీతం: ప్రమోద్ కుమార్ పరిసర్ల, నిర్మాత: దండెం పోలారావు, కథ-మాటలు-పాటలు-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: రాకేష్ రెడ్డి.

Sponsored links

Daamini Villa Movie Shooting Update:

Daamini Villa Movie Shooting Completed

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019