Advertisement

మహేశ్ కాంపౌండ్‌లో ఎన్టీఆర్ కథ.. గ్రీన్ సిగ్నల్!

Sun 15th Sep 2019 09:53 PM
ntr,mahesh,kgf director,prashant neel  మహేశ్ కాంపౌండ్‌లో ఎన్టీఆర్ కథ.. గ్రీన్ సిగ్నల్!
NTR or Mahesh: Who is the KGF director with? మహేశ్ కాంపౌండ్‌లో ఎన్టీఆర్ కథ.. గ్రీన్ సిగ్నల్!
Advertisement

అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం అనుకున్న కథ ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంపౌండ్‌లో వచ్చి వాలింది. ఇంతకీ డైరెక్టర్ ఎవరు..? అప్పుడంతా ఎన్టీఆర్‌తో ఎందుకు అనుకున్నారు..? ఇప్పుడెందుకు మహేశ్‌తో అనుకుంటున్నారు..? అనే విషయాలు తెలుసుకుందాం.

టాలీవుడ్ సూపర్‌స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న మహేశ్‌తో సినిమా తీయాలంటే ఏ డైరెక్టర్ అయినా సరే క్యూ కడుతుంటారన్న విషయం తెలిసిందే. ఒక్క టాలీవుడ్‌ డైరెక్టర్లే కాదు.. అన్ని ఇండస్ట్రీల డైరెక్టర్లకు ఏదో తెలియని ఉత్సాహంతో ముందుకొస్తుంటారు. అయితే మహేశ్ తదుపరి మూవీ.. ‘కేజీఎఫ్’ ద‌ర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఉంటుంద‌ని సమాచారం.

కేజీఎఫ్‌ మూవీతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన ఆయన.. జూనియర్ ఎన్టీఆర్‌ కోసం ఓ కథను సిద్ధం చేశాడు. అయితే ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ RRRలో ఎన్టీఆర్ బిజీబిజీగా ఉండటం.. 2021 వరకు ఖాళీగా లేకపోవడంతో.. ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని భావించిన ప్రశాంత్.. తిన్నగా మహేశ్ కాంపౌండ్‌లో వచ్చి వాలాడు. ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. ప్రిన్స్‌కు కథ వినిపించాడట. కథ బాగుందని మహేశ్ చెప్పారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత కానీ.. పట్టాలెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి ఈ సినిమా ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి మరి.

NTR or Mahesh: Who is the KGF director with?:

NTR or Mahesh: Who is the KGF director with?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement