ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nag ‘Bangarraju’ Movie Break.. New Movie Plan!

‘బంగార్రాజు’కు బ్రేక్.. నాగ్ కొత్త సినిమా!

మన్ముథుడు-02 సినిమా ఆశించినంతగా ఆడకపోయే సరికి కాస్త అసంతృ‌ప్తికి లోనైన అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం వెండి తెరను పక్కనెట్టి బుల్లి తెరపై వస్తున్న బిగ్‌బాస్-03కు మాత్రమే పరిమితం అయ్యారు. అయితే.. ఈ షో వంద రోజులు పూర్తవ్వగానే కల్యాణ్ కష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ చిత్రంలో నాగ్‌తో పాటు తన కుమారుడు చైతూ కూడా నటిస్తున్నాడు. 

ఆయన ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీబిజీగా ఉండటం.. నాగ్ కూడా బిగ్‌బాస్‌తో గ్యాప్ లేకుండా ఉండటంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు‌ను పెండింగ్‌లో పెట్టాలని అక్కినేని అనుకుంటున్నారట. అయితే ఈ గ్యాప్‌లో స్క్రిప్ట్ రైటర్ ‘సోల్‌మన్’తో సినిమా చేయాలని నాగ్ ఫిక్స్ అయ్యాడట. ఇటీవలే ఆయన కథ చెప్పగా నాగ్‌కు చాలా బాగా నచ్చిందట. 

అందుకే ఇక ఆలస్యం చేయకుండా.. ఇప్పటి వరకూ జరిగిన లోటును ఈ సినిమాతో కవర్ అవుతుందని నాగ్ ఓ నిర్ణయానికొచ్చాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. అయితే రాహుల్ రవీంద్రన్‌ సినిమాతో దెబ్బతిన్న నాగ్.. ఈ సినిమాతో పరిస్థితితో ఎలా ఉంటుందో..? అసలు ఇది పట్టాలెక్కే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి. 

Nag ‘Bangarraju’ Movie Break.. New Movie Plan!

Nag 'Bangarraju' Movie Break.. New Movie Plan!
nagarjuna
bangarraju
break.nag new movie