ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rumours on Vijay Deverakonda Fighter Story

‘ఫైటర్’ స్టోరీపై ఈ వార్తలేంటి?

Rumours on Vijay Deverakonda Fighter StoryRumours on Vijay Deverakonda Fighter Story

రామ్ తో ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ పూరి వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చేస్తున్నట్టు  ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. నవంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ అవ్వనున్న ఈ సినిమా కథ ఇదే అని గత కొన్ని రోజులు నుండి వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ పాత్రలో ఓ మాజీ హీరో నటించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం అది నిజం కాదని తెల్సింది. ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. తన ప్రేమ కోసం ఆ యువకుడు ఏం చేసాడనేదే సినిమా పాయింట్ అట. దీన్ని తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు పూరి. ఇక ఈ మూవీకి ‘ఫైటర్’ అని టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడని మరో టాక్.

ఇందులో హీరోయిన్స్ కోసం ఆల్రెడీ కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు పూరి. వారిలో ఎవరిని ఫైనల్ చేస్తాడో మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే ఆ హీరోయిన్స్ పేరులు బయటకు వచ్చే అవకాశముంది. ఈ మూవీ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.

Vijay Deverakonda and Puri Fighter Story Revealed

vijay deverakonda
puri jagannath
fighter
story
revealed