Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tollywood Anchor relationShip With Businessman!

భర్తను వదిలి.. బిజినెస్‌మెన్‌తో టాలీవుడ్ యాంకర్!?

Tollywood Anchor relationShip With Businessman!

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పాపులర్ యాంకర్.. బిజినెస్‌మెన్‌కు బాగా దగ్గరయినట్లు సమాచారం. ఇప్పటికే భర్తకు దూరంగా ఉన్న ఈ యాంకరమ్మ.. బిజినెస్‌‌మెన్‌తో రిలేషన్ షిప్‌లో ఉందట. అయితే ఆ యాంకరమ్మ ఎవరు..? ఆ బిజినెస్‌మెన్ ఎవరు..? వారి పేర్లు ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం కూడా.

అసలు విషయానికొస్తే.. టాలీవుడ్‌లో యాంకర్‌గా ఓ వెలుగు వెలుగుతున్న టైమ్‌లోనే లవ్ మ్యారేజీ చేసుకుంది. అయితే కొన్ని రోజుల పాటు జీవితాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయారు. భర్తకు దూరమైన తర్వాత ఆ యాంకరమ్మ బిజినెస్‌తో పరిచయం ఏర్పడటంతో బాగా దగ్గరయ్యారట. ఇందుకు కారణం.. ప్రస్తుతం జూనియర్ యాంకర్స్‌తో.. ఈ సీనియర్ యాంకర్ పోటీ పడలేక లైఫ్‌ను ఆయనతో ఎంజాయ్ చేస్తోందట.

అంతేకాదు.. ఇప్పటికే యాంకర్-బిజినెస్‌మెన్ ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరిగేశారట. ఆ యన గోవాలో ప్రముఖ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. అయితే యాంకరమ్మ మాత్రం తమ వ్యవహారం ఇద్దరి మధ్యే ఉందని.. మూడో కంటికి తెలియలేదని అనుకుంటోంది.. ఈ వ్యవహారం మాత్రం ఎప్పుడో లీకైపోయింది. అయితే వీరిద్దరూ రిలేషన్‌కే పరిమితం అవుతారా..? లేకుంటే పెళ్లి చేసుకుని ఒక్కటవుతారా..? ఎంజాయ్ చేసి విడిపోతారా..? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Tollywood Anchor relationShip With Businessman!

tollywood anchor
relationship
businessman
marriage