మహేశ్‌తో తమన్నా స్టెప్పులు.. గట్టిగానే పారితోషికం!

Tue 10th Sep 2019 02:24 PM
milk beauty tamannah,romance,mahesh babu,sarileru neekevvaru  మహేశ్‌తో తమన్నా స్టెప్పులు.. గట్టిగానే పారితోషికం!
Milk Beauty Tamanna romance with Mahesh.. High remuneration! మహేశ్‌తో తమన్నా స్టెప్పులు.. గట్టిగానే పారితోషికం!
Sponsored links

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్, రష్మిక మందన్నా నటీనటులుగా వస్తున్న చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాను హిట్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా జరుపుకోవడంతో పాటు.. ఎవరెవరు ఇందులో నటిస్తున్నారన్నదానిపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. 

అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ మహేశ్‌తో మిల్క్‌బ్యూటీ తమన్నా కూడా కాలు కదపనుందని తెలుస్తోంది. వాస్తవానికి స్పెషల్ సాంగ్స్‌లో నటించడానికి ఈ ముద్దుగుమ్మ  చాలా దూరంగా ఉంటుంది. సినిమా ప్రారంభంలో వచ్చే ఇంట్రెడక్షన్ సాంగ్‌లో తమన్నా నటించి మెప్పిస్తుందట. ఇప్పటికే ఇందుకు సంబంధించి షూటింగ్ జరపడానికి సెట్స్ వేశారని తెలుస్తోంది.అంతేకాదు.. ఇలా స్టెప్పులేయడానికి కోటి రూపాయిల వరకు తమన్నా పుచ్చుకుందట. అయితే ఇది ఎంతవరకు వాస్తవమనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. మ‌హేశ్‌-త‌మ‌న్నా క‌లిసి ‘ఆగ‌డు’ సినిమాలో నటించిన విషయం విదితమే. అయితే ఈ ఒక్కానొక్క సినిమా ఆశించినంతగా ఆడలేదు. చాలా రోజుల తర్వాత మహేశ్ సరసన మళ్లీ తమన్నా నటిస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

Milk Beauty Tamanna romance with Mahesh.. High remuneration!:

Milk Beauty Tamanna romance with Mahesh.. High remuneration!

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019