తమన్నాకెవరూ సరిలేరని దించుతున్నారు

Tue 10th Sep 2019 01:23 PM
tamanna,special role,sarileru neekevvaru movie,mahesh babu,anil ravipudi  తమన్నాకెవరూ సరిలేరని దించుతున్నారు
Tamanna in Sarileru Neekevvaru Movie తమన్నాకెవరూ సరిలేరని దించుతున్నారు
Sponsored links

మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం యొక్క షూటింగ్ జరుగుతుంది. అలనాటి నటి విజయశాంతి ఇందులో ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. అంతే కాదు ఈసినిమాకి మరింత బజ్ తీసుకొచ్చేందుకు అనిల్ మరో ప్లాన్ వేసాడు.

ఓ సాంగ్ కోసం మిల్క్ బ్యూటీ తమన్నాను తీసుకున్నారు. అది కూడా మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్‌కు తమన్నాను తీసుకోవడం విశేషం. ఇందులో మహేష్ ఇంటిలిజెన్స్ అధికారి అని అందరికి తెలిసిందే. అందుకే మహేష్ పక్కన ఈ బ్యూటీ అయితే బాగుంటది అని తీసుకున్నారు.

ఇప్పటివరకు తమన్నా రెండు మూడు స్పెషల్ సాంగ్స్ చేసింది. అన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు లో చేస్తుంది. మహేష్ - తమన్నా కాంబినేషన్ లో ‘ఆగడు’ సినిమా వచ్చింది. ఇప్పుడు రెండోసారి వీరిద్దరూ స్టెప్స్ వేయనున్నారు. శృతి హాసన్‌నా? తమన్నానా? అనుకుని చివరికి తమన్నానే ఫైనల్ చేసారు యూనిట్. సంక్రాంతికి ఈమూవీ రిలీజ్ కానుంది.

Sponsored links

Tamanna in Sarileru Neekevvaru Movie:

Tamanna Special Role in Sarileru Neekevvaru Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019