Advertisementt

‘మాస్’ మూసలో కొట్టుకుపోతున్నాడు!!

Wed 04th Sep 2019 04:55 PM
ram pothineni,tollywood,mass,mass movies  ‘మాస్’ మూసలో కొట్టుకుపోతున్నాడు!!
news about Hero ram pothineni ‘మాస్’ మూసలో కొట్టుకుపోతున్నాడు!!
Advertisement
Ads by CJ

ప్రతి ఒక్క హీరో మాస్ సినిమాల్తో అలరించి మాస్ ప్రేక్షకులకు దగ్గర కావాలని చూస్తారు. మాస్ ప్రేక్షకులు ఒక్కసారి తమ హీరోని చేసుకుంటే చాలు.. జీవితాంతం ఆ హీరోని నెత్తిన పెట్టుకుని మోస్తారు. అందుకే హీరోలంతా మాస్ కథల చుట్టూ తిరుగుతారు. అలా చాలామంది ప్రయత్నించి బోల్తా కొటారు. తాజాగా ప్రేమ కథా చిత్రాలతో యావరేజ్‌గా మారిన రామ్ ఇస్మార్ట్ శంకర్ అనే మాస్ సినిమా తో బంపర్ హిట్ కొట్టాడు. మొదటిలో మాస్ మసాలా రామ్ కి పాడకపోయినా ఇస్మార్ట్ హిట్ తో రామ్ మళ్ళి మాస్ కథలు మూసలోకి మారిపోయాడు.

అందుకే ఇస్మార్ట్ ముందు ఒప్పుకున్నా సినిమాలను ఇప్పుడు రిజెక్ట్ చేసున్నాడనే టాక్ మొదలైంది. తాజాగా తమిళంలో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన థ్రిల్లర్ సినిమా తడమ్ ని రామ్ ఒదులుకున్నాడనే టాక్ నడుస్తుంది. మగిల్ తిరుమణి డైరెక్షన్ లో తెరకెక్కిన తడమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడిన టైం లో రామ్ పెదనాన్న స్రవంతి రవి కిషోర్, రామ్ కోసం ఆ హక్కులను కొన్నట్లుగా తెలిసింది. కానీ రామ్ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ లాంటి కథలైతేనే ఓకె చేస్తునంట్లుగా... తడమ్ లాంటి రీమేక్ వద్దని చెప్పినట్లుగా ఫిలిం నగర్ టాక్.

news about Hero ram pothineni:

news about Hero ram pothineni

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ