‘2 అవ‌ర్స్ ల‌వ్‌’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ విశేషాలివే!

Tue 03rd Sep 2019 02:31 PM
2 hours love movie,pre release event,2 hours love  ‘2 అవ‌ర్స్ ల‌వ్‌’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ విశేషాలివే!
2 Hours Love Movie Pre Release Event details ‘2 అవ‌ర్స్ ల‌వ్‌’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ విశేషాలివే!
Sponsored links

శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్ నిర్మాణంలో  శ్రీ ప‌వార్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘2 అవ‌ర్స్ ల‌వ్‌’. కృతి గార్గ్ హీరోయిన్‌. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ప్రేమ క‌థ‌ల‌ను ప్రేక్ష‌కులు చూసుంటారు. కానీ స‌రికొత్త ప్రేమ క‌థాంశంతో ‘2 అవ‌ర్స్ ల‌వ్’ చిత్రం తెర‌కెక్కింది. సెప్టెంబ‌ర్ 6న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా హాజరై బిగ్ టికెట్‌ను విడుద‌ల చేశారు. 

ఈ సంద‌ర్భంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ గ్యాని సింగ్ మాట్లాడుతూ.. ‘‘దాదాపు ఈ టీమ్‌లో ప‌నిచేసిన వాళ్లంద‌రం కొత్త‌వాళ్ల‌మే. శ్రీప‌వార్ హీరోగా చేస్తూ, ద‌ర్శ‌కుడిగా సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. మంచి సంగీతం కుదిరింది. సినిమా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. అంద‌రికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. 

హీరోయిన్ కృతిగార్గ్ మాట్లాడుతూ.. ‘‘బ్యూటీపుల్ అండ్ అమేజింగ్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ‘2 అవ‌ర్స్ ల‌వ్‌’ చిత్రంతో టాలీవుడ్‌లో నా జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. డైరెక్ట‌ర్‌, హీరో శ్రీగారికి, కోడైరెక్ట‌ర్ రాజుగారికి, నిర్మాత‌లు, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్’’ అన్నారు. 

హీరో, ద‌ర్శ‌కుడు శ్రీప‌వార్ మాట్లాడుతూ... ‘‘2012లో ఈ పాయింట్‌ను అనుకున్నాను. 2016లో క‌థ‌ను రాశాను. చాలా మంది నిర్మాత‌ల‌కు ఫోన్ చేశారు. నేను ఎక్క‌డా ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేయ‌లేదు. దీంతో ఎక్క‌డా అవ‌కాశం రాలేదు. చివ‌ర‌కు నా ఫ్యామిలీ, స్నేహితుల స‌హ‌కారంతో సినిమాను తెర‌కెక్కించాను. వారంద‌రికీ నా థ్యాంక్స్‌. నా ప్ర‌తి అడుగులోనూ వారే ఉన్నారు. కోడైరెక్ట‌ర్ రాజుగారికి, రైట‌ర్ ర‌జ‌నీకాంత్‌గారికి థ్యాంక్స్‌. కెమెరామెన్ ప్ర‌వీణ్ వ‌న‌మాలిగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. ప్ర‌తి ఒక డిపార్ట్‌మెంట్ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. గ్యానీ అద్భుత‌మైన ట్రాక్స్ ఇస్తే.. అజ‌య్‌గారు అద్భుత‌మై బ్యాగ్రౌండ్ ఇచ్చారు. నేను సినిమాను స్టార్ట్ చేయాల‌నుకోగానే ఇండ‌స్ట్రీలోకి ఎందుకు? అని చాలా మంది అన్నారు. కానీ ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమా చేశాం. కంటెంట్ ఉంటే సినిమాలు హిట్ అవుతాయ‌ని నేను బాగా న‌మ్ముతాను. అలాంటి డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ సినిమాను చేశాను. సినిమాను స‌క్సెస్ చేసి కంటెంట్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని నిరూపించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘‘టైటిల్ బావుంది. న‌టీన‌టుల స్క్రీన్ ప్రెజ‌న్స్ బావుంది. గ్యాని మంచి ట్యూన్స్ ఇచ్చారు. శ్రీప‌వార్‌లో చాలా క్లారిటీ ఉంది. త‌ను నిజాయ‌తీగా ఉండే ఆలోచ‌న‌ల‌తో చేసిన సినిమా ఇది. క‌థ‌ల‌ను న‌మ్మి ముందుకు వ‌స్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. కంటెంట్ ఈజ్ కింగ్. ప్రేక్ష‌కులు అలాంటి సినిమాల‌కే ఆద‌ర‌ణ‌నిస్తారు. 2 అవ‌ర్స్ ల‌వ్ చిత్రానికి డ‌బ్బుల‌తో పాటు యూనిట్‌కి మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

Sponsored links

2 Hours Love Movie Pre Release Event details:

Celebrities speech at 2 Hours Love Movie Pre Release Event

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019