‘మిస్టర్ రావణ’ మొదలైంది

మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ బాలీవుడ్ స్టార్ నటుడు అనూప్ సింగ్ ఠాగూర్ టైటిల్ పాత్రలో ‘మిస్టర్ రావణ’ అనే చిత్రం తెరమీదకు వస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తీసే ఈ సినిమా ఇటీవలే ముంబై లోని ప్రపంచ ప్రసిద్దమైన శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రారంభమైంది. ‌కుందన ఆర్ట్స్ పతాకంపై కుందన్ రాజ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 

అనూప్ సింగ్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్, నా క్యారక్టరైజేషన్‌ను చాలా బాగా డిజైన్ చేశారు. ‌నటుడిగా నా కెరీర్‌లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందన్నారు.

సలోని మాట్లాడుతూ.. రియలిస్టిక్ కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. నా పాత్ర వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు. 

దర్శకుడు కుందన్ రాజ్ మాట్లాడుతూ.. అనూప్ సింగ్ ఠాగూర్ విలన్ గా మనకు సుపరిచితుడే.‌ ఈ సినిమాలో కూడా ఆయన టైటిల్ పాత్రలో నట విశ్వరూపాన్ని చూపిస్తారు. ‌సలోని హీరోయిన్‌గా నటిస్తుందన్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా ఉంటుందన్నారు.‌ భారీ బడ్జెట్‌తో నాలుగు భాషల్లో ఈ సినిమా తెరమీద‌కు రానుంది. అన్నీ భాషల నటీనటులు ఈ చిత్రంలో ఉంటారన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి, సహనిర్మాత: ఇంద్రజిత్, నిర్మాణం: కుందన్ ఆర్ట్స్‌, కథ-కథనం-దర్శకత్వం: కుందన్ రాజ్.

Thakur Anoop Singh New Movie Mister Ravana Movie Details

Mister Ravana Movie Launched
thakur anoop singh
mister ravana movie
saloni
anoop singh thakur