‘సాహో’ ఛాన్స్ మిస్ చేసుకున్న కాజల్!

Sun 25th Aug 2019 09:53 PM
kajal agarwal,saaho,special song,heroine kajal agarwal,jacqueline fernandez  ‘సాహో’ ఛాన్స్ మిస్ చేసుకున్న కాజల్!
Kajal the original choice for Saaho special ‘సాహో’ ఛాన్స్ మిస్ చేసుకున్న కాజల్!
Sponsored links

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. సినిమా రిలీజ్‌ సమయం దగ్గరపడుతుండటంతో ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. గత రెండ్రోజులుగా ఈ సినిమాలో ‘బ్యాడ్ బాయ్’ అనే ఐటెమ్ సాంగ్‌కు బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్‌కు కోట్లిచ్చి మరీ అరువుకు తెచ్చుకున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ బ్యాడ్ బాయ్ పాట యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

ఇక అసలు విషయానికొస్తే.. ఈ ఐటెమ్ సాంగ్‌కు మొదట చందమామ భామ.. కాజల్‌ను దర్శకనిర్మాతలు సంప్రదించారట. అయితే ఈ ముదురు భామ గట్టిగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో రెండోమాట కూడా మాట్లాడకుండానే మిన్నకుండిపోయి.. బాలీవుడ్ భామను పట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆమె అడిగిన రెమ్యునరేషన్‌కు నిర్మాత ఒకింత కంగుతిన్నారట. అందుకే ఇక కాజల్‌ అక్కర్లేదనుకుని జాక్వలిన్‌ను పట్టుకొచ్చారట. 

వాస్తవానికి ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ‘పక్కా లోకల్.. పక్కా లోకల్’ అంటూ నర్తించిన విషయం విదితమే. అందుకే ఈ భామ అయితే కరెక్టుగా ప్రభాస్ సరసన సెట్ అవుతుందని భావించిన నిర్మాతలు.. ఆమెను అడగ్గా ఐటెమ్స్‌లో నటించకూడదని అలా చెప్పిందో లేకుంటే మరే కారణాలున్నాయో తెలియాల్సి ఉంది మరి. ప్రభాస్ సరసన ఈ భారీ చిత్రంలో ఒక వేళ నటించుకుంటే ఈ భామ అదృష్టవంతురాలేనేమో.. పాపం లక్కీ చాన్స్ మిస్ చేసుకుంది. 

Sponsored links

Kajal the original choice for Saaho special:

Kajal Demanded More, Missed Saaho

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019