బాబోయ్.. బాహుబలి-3 కూడా ఉందట

Sun 25th Aug 2019 11:58 AM
rajamouli,plans,baahubali 3,prabhas,interview  బాబోయ్.. బాహుబలి-3 కూడా ఉందట
Prabhas About Baahubali 3 in an interview బాబోయ్.. బాహుబలి-3 కూడా ఉందట
Sponsored links

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1,2 లు ఏ  రేంజ్‌లో హిట్టయ్యాయో.. తెలుగు ఖ్యాతిని ఏ రేంజ్‌కు తీసుకెళ్లాయో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలు తెరకెక్కించడానికి సమయం చాలా పట్టినప్పటికీ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో పాటు ప్రపంచానికి తెలుగోడి సత్తా చాటి చెప్పడంతో ఆ కిక్ ఎంతో మజానిచ్చింది.

అయితే బాహుబలి-03 కూడా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు స్వయానా ప్రభాస్ చెప్పడం విశేషం. ఇటీవల సినిమా ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. బాహుబలి సీరిస్ తెరకెక్కించడానికి రాజమౌళికి ఉత్సుకత ఉంటే తాను రె‘ఢీ’ అన్నట్లు చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగని ఆయన.. బాహుబలి రెండు భాగాల్లో దాదాపు 60% కథను మాత్రమే పూర్తి చేశామని.. జక్కన్న మదిలో బాహుబలి  సీక్వెల్‌-3 కూడా ఉందని డార్లింగ్ చెప్పాడు. ఇది ఒకింత ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు మంచి కిక్కించే వార్త అయినప్పటికీ ఏ మాత్రం కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయో తెలియాల్సి ఉంది.

Sponsored links

Prabhas About Baahubali 3 in an interview:

Rajamouli plans Baahubali 3 says Prabhas

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019