వామ్మో.. బన్నీతో రొమాన్స్‌కు అన్ని కోట్లా!

Sat 24th Aug 2019 01:51 PM
disha patani,remuneration,bunny movie,4 crores  వామ్మో.. బన్నీతో రొమాన్స్‌కు అన్ని కోట్లా!
Disha patani Shocking Remuneration For Bunny Movie వామ్మో.. బన్నీతో రొమాన్స్‌కు అన్ని కోట్లా!
Sponsored links

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఇప్పటికే షూటింగ్ షురూ చేసిన చిత్రబృందం పూజా కోసం భారీ సెట్‌వేసింది. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్- వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లోని సినిమా కోసం దిశా పటానీని ఎంపిక చేసినట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆల్ మోస్ట్ ఫైనల్ అయిపోయిందని అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉందని తెలుస్తోంది. 

బన్నీతో రొమాన్స్‌కు ఈ ముద్దుగుమ్మ ఒకట్రెండు కాదు ఏకంగా రూ. 4కోట్లు డిమాండ్ చేసిందట. అయినప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం అస్సలు తగ్గకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇప్పుడు బాలీవుడ్ భామలే.. టాలీవుడ్‌లో అందాలతో మత్తెక్కిస్తున్నారని దర్శకనిర్మాతలంతా ముంబై బాట పట్టారు. అందుకే బన్నీ కోసం బాలీవుడ్ భామను పట్టుకురావాలని భావించి దిశాను తెస్తున్నారట.

కాగా.. ‘లోఫర్’లో నటించిన దిశా పటాని.. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ముంబైకి చెక్కేసింది. అయితే ఈ సారి మళ్లీ అవకాశం రావడంతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తోంది. ఫస్ట్ సినిమాతో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయిన ఈ భామ ఈ సినిమాతో అయినా రాణిస్తుందో లేదో వేచి చూడాలి మరి.

Sponsored links

Disha patani Shocking Remuneration For Bunny Movie:

Disha patani Shocking Remuneration For Bunny Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019