సంపూ మళ్లీ సింపేయడానికి సిద్ధం!?

Sat 24th Aug 2019 11:16 AM
sampoo,sampoornesh babu,kobbarimatta,sai rajesh  సంపూ మళ్లీ సింపేయడానికి సిద్ధం!?
Sampoo Again comes With Kobbarimatta Director సంపూ మళ్లీ సింపేయడానికి సిద్ధం!?
Sponsored links

బర్నింగ్ స్టార్‌ సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన ‘కొబ్బరి మట్ట’ సినిమా ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎన్ని సినిమాలున్నా ‘సాయి రాజేష్’ మాత్రం వాటన్నింటినీ పక్కనబెట్టించి ప్రేక్షకులను కొబ్బరిమట్టకు రప్పించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే ఇదే కాంబోలో మరో సినిమా రాబోతోందని తెలుస్తోంది. అంటే మరో సంచలనానికి తెరలేపుతున్నారన్న మాట.

వాస్తవానికి.. కొబ్బరిమట్ట సినిమా అసలు పట్టాలెక్కుతుందా లేదా..? అని ఎన్నో అనుమానాలు.. ఆఖరికి షూటింగ్ షురూ చేసి థియేటర్లలోకి రప్పించారు కూడా. అయితే ఇదే ఊపు మీద మరో సినిమా చేయాలని ఈ కాంబో భావిస్తున్నారు. మునుపటితో పోలిస్తే సంపూకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెరిగింది. అందుకే సాయి రాజేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పటికే రెండు సినిమాలతో మంచి పేరుతెచ్చుకున్న ఈ కాంబో మూడో సినిమా చేసి హ్యాట్రిక్ కొడతారా లేకుంటే చాలు బాబోయ్ ఇప్పటి వరకూ అని మిన్నకుండిపోతారో వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

Sampoo Again comes With Kobbarimatta Director:

Sampoo Again comes With Kobbarimatta Director  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019