వైభవంగా దర్శకుడు నర్రా బర్త్‌డే వేడుక

Fri 23rd Aug 2019 10:25 PM
narra siva nageswara rao,birthday,celebrations,jamuna,annapurna,suresh kondeti  వైభవంగా దర్శకుడు నర్రా బర్త్‌డే వేడుక
Narra Siva Nageswara Rao Birthday Celebrations వైభవంగా దర్శకుడు నర్రా బర్త్‌డే వేడుక
Sponsored links

అంగరంగ వైభవంగా ప్రముఖ దర్శకుడు నర్రా శివనాగేశ్వర రావు పుట్టిన రోజు వేడుకలు..!!

ప్రముఖ దర్శకుడు నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రముఖులైన శ్రీ అన్నపూర్ణమ్మ, జమున, సురేష్ కొండేటి, వినాయక రావు గారుల సమక్షంలో తన బర్త్‌డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. 

ఈ సందర్భంగా జమున గారు మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు నర్రా శివనాగేశ్వరావు, నా దత్త పుత్రుడు మెగాస్టార్ చిరంజీవి గారి  పుట్టినరోజు శివనాగేశ్వరావు పుట్టినరోజు ఒకే రోజు కావడం, ఇద్దరి పుట్టిన రోజు ఆగష్టు 22 వ తేదీ కావడం గొప్ప విశేషం. ఈ పుట్టిన రోజు సందర్భంగా మా శివనాగు కూడా ఇంకా మరిన్ని మంచి చిత్రాలు తీసి మెగా డైరెక్టర్ కావాలని అమ్మగా దీవిస్తూ మెగాస్టార్ చిరంజీవిని దర్శకుడు శివనాగుని ఇద్దరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనసారా దీవిస్తున్నాను అన్నారు. వచ్చిన అతిధులకు శివనాగు కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం ఆయన అన్నపూర్ణమ్మ గారి మనవడు దేవినేని చిత్రాలతో బిజీగా ఉన్నానని తనకు మంచి అవకాశాలు ఇచ్చిన తన నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నాను అన్నారు.

Sponsored links

Narra Siva Nageswara Rao Birthday Celebrations:

Celebrities at Narra Siva Nageswara Rao Birthday Celebrations

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019