అల్లు అర్జున్ ‘ఐకాన్’ హీరోయిన్ ఈమేనా?

Fri 23rd Aug 2019 09:32 PM
disha patani,heroine,allu arjun,icon,venu sriram,dil raju,akhil  అల్లు అర్జున్ ‘ఐకాన్’ హీరోయిన్ ఈమేనా?
Heroine Selected for Allu Arjun Icon Movie అల్లు అర్జున్ ‘ఐకాన్’ హీరోయిన్ ఈమేనా?
Sponsored links

తెలుగు తెరకు పూరి జగన్నాధ్ లోఫర్ అనే సినిమా ద్వారా దిశాపటాని ని పరిచయం చేసాడు. ఇందులో ఆమె నటన కన్న గ్లామర్ షో కి బాగా ఎట్రాక్ట్ అయ్యారు ప్రేక్షకులు. అయితే ఈ మూవీ సరిగా ఆడకపోవడంతో ఆమెకు ఇక్కడ అవకాశాలు రాలేదు. దాంతో ఆమె బాలీవుడ్ పై కన్నేసింది. అక్కడ వరస సినిమాలు హిట్ అవ్వడంతో అక్కడ సినిమాలే చేస్తుంది దిశా.

అయితే రీసెంట్ గా తెలుగు తెరపై రీఎంట్రీ ఇవ్వనుంది దిశా. అల్లు అర్జున్ - దిల్ రాజు - వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఐకాన్’ సినిమాలో దిశాపటానిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మొదట ఈమె ప్లేస్ లో అలియా భట్ ని తీసుకుందాం అనుకున్నారు కానీ ఆమె డేట్స్ లేక ఈమెను తీసుకున్నట్టు తెలుస్తుంది.

అలానే అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ సినిమా కోసం దిశాపటానీ వైపు వెళ్లింది గీతాసంస్థ దృష్టి. కానీ దిశా మాత్రం అఖిల్ తో సినిమా అంటే ముందు వెనుకలు ఆలోచించినట్లు తెలుస్తోంది.

Sponsored links

Heroine Selected for Allu Arjun Icon Movie:

Disha Patani in Allu Arjun and Venu SriRam Film

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019