కొత్త సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనట

Thu 22nd Aug 2019 06:40 PM
balayya,roles,new movie,ks ravikumar  కొత్త సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనట
These Are Balayya Roles in New Movie! కొత్త సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనట
Sponsored links

నటసింహ నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం థాయ్‌లాండ్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం విదితమే. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీమూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇది వరకు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. గడ్డం, మీసం ఉన్న లుక్‌లో బాలయ్యను చూసి థ్రిల్ అవుతున్నారు.

అయితే బాలయ్యను లుక్‌ను బట్టి చూస్తే ఆయన పాత్రేంటో తెలిసిపోతోందని కొందరు నెటిజన్లు, బాలయ్య అభిమానులు కథే కాదు.. సినిమా ఇలా ఉండబోతోందంటూ పాత్రలతో సహా చెప్పేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేయబోతున్నారని.. అందులో ఒకటి బిలియనీర్ గెటప్, మరొకటి మాస్ అవతార్ అని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజానిజాలెంతో కానీ వినడానికి మాత్రం కాసింత ఇంట్రెస్టింగ్‌గానే ఉంది మరి.

సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.

Sponsored links

These Are Balayya Roles in New Movie!:

These Are Balayya Roles in New Movie!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019