Advertisement

స‌క్సెస్ మీట్‌కు అందుకే రాలేదు: అనుపమ

Wed 21st Aug 2019 09:07 PM
rakshasudu,success,anupamaparameswaran,bellamkonda srinivas,press meet  స‌క్సెస్ మీట్‌కు అందుకే రాలేదు: అనుపమ
Rakshasudu Movie Team Press Meet స‌క్సెస్ మీట్‌కు అందుకే రాలేదు: అనుపమ
Advertisement

మా ఏ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రూపొందిన తొలి చిత్రం ‘రాక్ష‌సుడు’ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని సాధించ‌డం ఆనందంగా ఉంది - నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఏ స్టూడియో బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రాక్ష‌సుడు’. ఆగస్ట్ 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా మూడు వారాల ప్ర‌ద‌ర్శ‌న‌ను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో... 

నిర్మాత కొనేరు స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - ‘‘రాక్ష‌సుడు సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. అలాగే పిల్లలు నుండి పెద్ద‌లు వ‌ర‌కు అంద‌రినీ సినిమా ఆక‌ట్టుకుంటుంది. ఆడ‌పిల్ల‌ల పెంప‌కం విష‌యంలో త‌ల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లను సందేశాత్మ‌కంగా చూపించారు. సినిమా మూడు వారాల‌ను పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి సినిమా అడుగు పెట్టింది. మ‌రో రెండు వారాల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను సాధించే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మా ఏ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రూపొందిన తొలి చిత్రం ఇంత పెద్ద విజయాన్ని సాధించ‌డం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు.

ర‌మేశ్ వ‌ర్మ మాట్లాడుతూ - ‘‘సినిమా క‌థ‌పై న‌మ్మ‌కంతో చేశాం. మా న‌మ్మ‌కం ఈరోజు నిజ‌మైంది. ఒరిజిన‌ల్ కంటెంట్‌లోని అంశాల‌ను మిస్ చేయ‌కుండా మ‌న‌కు త‌గ్గ‌ట్టు చేశాం. అనుప‌మ మంచి పాత్ర చేసింది. ముందు ఈ పాత్ర‌లో ఆమె న‌టించ‌డానికి అంగీక‌రించలేదు. చివ‌ర‌కు మంచి సినిమాలో అవ‌కాశం కోల్పోకు అని తండ్రి చెప్పిన మాట‌ల‌కు క‌ట్టుబ‌డి న‌టించింది’’ అన్నారు. 

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మాట్లాడుతూ.. ‘‘కొన్నిరోజులు హెల్త్ బాలేదు. త‌ర్వాత త‌మిళంలో షూటింగ్‌లో పాల్గొన‌డం వ‌ల్ల స‌క్సెస్ మీట్‌కు హాజ‌రు కాలేక‌పోయాను. మంచి సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ కెరీర్‌కు ఎప్పుడూ సాయ‌ప‌డుతుంది. అలాంటి సినిమానే రాక్ష‌సుడు. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్’’ అన్నారు.

Rakshasudu Movie Team Press Meet:

Happy with Rakshasudu Movie Success: Movie Team

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement