షూటింగ్‌లో విక్టరీ వెంకటేష్‌కు గాయాలు!!

Sun 18th Aug 2019 06:49 PM
victory venkatesh,injured,venky mama,naga chaitanya  షూటింగ్‌లో విక్టరీ వెంకటేష్‌కు గాయాలు!!
Victory Venkatesh injured on Venky Mama sets షూటింగ్‌లో విక్టరీ వెంకటేష్‌కు గాయాలు!!
Sponsored links

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య.. మామా అల్లుళ్లు కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. ఇప్పటికే చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. బాబీ బర్తడ్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి చిన్నపాటి సర్‌ఫ్రైజ్‌ను ఇచ్చిన విషయం విదితమే. నాటి నుంచి నాన్ స్టాప్‌గా షూటింగ్‌ షూరు చేస్తున్నారు. అయితే షూటింగ్‌లో విక్టరీ వెంకీకి గాయాలైనట్లు సమాచారం. వెంకీ కాలికి గాయం అవ్వడంతో.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందించినట్లు తెలుస్తోంది.

అంతేకాదు వైద్యుల సలహా మేరకు ఆ ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం బయటికొచ్చారని.. ప్రస్తుతానికి షూటింగ్ మొత్తం నిలిపేశారని సమాచారం. అయితే పూర్తిగా రెండు నుంచి 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారట. మొత్తానికి చూస్తే ‘వెంకీ మామ’ షూటింగ్‌కు కొద్దిరోజులు గ్యాప్ ఇవ్వక తప్పదట. అయితే  ఈ చిత్రాన్ని అక్టోబర్ 4న అభిమానుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావించింది.. అయితే ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి. అంతేకాదు వెంకీ గాయాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sponsored links

Victory Venkatesh injured on Venky Mama sets:

Victory Venkatesh injured on Venky Mama sets  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019