రష్మిక ఈ లీకులేంటి.. ఎందుకింత ఆత్రం!?

Sun 18th Aug 2019 06:29 PM
sultan,rashmika mandanna,title,karthi  రష్మిక ఈ లీకులేంటి.. ఎందుకింత ఆత్రం!?
Cinema Unit Angry On Rashmika mandanna.. ! రష్మిక ఈ లీకులేంటి.. ఎందుకింత ఆత్రం!?
Sponsored links

రష్మిక మందన్న.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’.. కార్తి సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. అంటే ఇటు టాలీవుడ్‌లో అటు కోలీవుడ్‌లో రెండుచేతులతో సంపాదిస్తోందన్న మాట. మహేశ్ సినిమాలో ఇటీవల షూటింగ్ పాల్గొన్న ఈ భామ.. అటు కార్తి సినిమాలోను గ్యాప్ వచ్చినప్పుడు షూటింగ్ చేసుకొని తిరిగొచ్చేస్తోంది. అయితే ఈ కన్ఫూజన్‌లో ఏం చేస్తోందో తెలియక ఓ బ్లండర్ మిస్టేక్ చేసేసింది ఈ ముద్దుగుమ్మ.

వాస్తవానికి కార్తి-రష్మిక కాంబోలో వస్తున్న సినిమాకు ఇంతవరకూ టైటిల్ ఖరారు చేయలేదు. సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసిన రష్మిక.. కింద టైటిల్, షూట్ టైమింగ్ వాటన్నింటినీ చూసుకోకుండానే నెట్టింట్లో పోస్ట్ చేసేసింది. దీంతో సినిమా పేరు.. లీక్ అవ్వడంతో చిత్రబృందం తీవ్రస్థాయిలో ఫైర్ అవుతోంది. ‘రష్మిక ఈ లీకులేంటి.. ఎందుకింత ఆత్రం!?’ అని దర్శకుడు, నిర్మాత ఇద్దరూ కన్నెర్రజేశారట. ఇంతకీ కార్తీ–రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రానికి టైటిల్ ఏంటో తెలుసా..‘సుల్తాన్’. మరి అందరికీ తెలిసిపోయింది గనుక.. ఇదే టైటిల్‌తో దర్శకనిర్మాతలు ముందుకెళ్తారో లేకుంటే మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Sponsored links

Cinema Unit Angry On Rashmika mandanna.. !:

Cinema Unit Angry On Rashmika mandanna.. !

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019